Easy Mango Lassi Recipe: క్షణాల్లో అదిరిపోయే మామిడి లస్సీ.. ఒక్క గ్లాస్‌తో ఆగరు అంతే..
Easy Mango Lassi Recipe: వేసవి కాలం వచ్చిందంటే చల్లని పానీయాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.. ఇంటి దగ్గరే ఎన్నో రకాల పానియాలు తయారు చేస్తుంటారు.. అలాంటి సమయంలో సాధారణ లస్సీకి బదులుగా మామిడి లస్సీ ట్రై చేస్తే రుచితో పాటు శరీరానికి చల్లదనం కూడా లభిస్తుంది. మామిడి పండ్ల సీజన్లో ఈ ప్రత్యేక లస్సీ తాగితే డెజర్ట్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది.
మామిడి లస్సీ కేవలం రుచికరమైన పానీయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్-ఎ సమృద్ధిగా ఉండటంతో చర్మానికి మంచిది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. అంతేకాదు, ఈ పానీయం తాగితే చాలా సేపు కడుపు నిండిన భావన ఉంటుంది. ఇది మామిడి పండ్ల సీజన్ కూడా కావడంతో.. సింపుల్‌గా క్షణాల్లో అదిరిపోయే మామిడి లస్సీ తయారు చేసుకోవచ్చు..
Also Read
- Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే 'పెసరపప్పు పకోడీ'లను చేసేయండి ఇలా..!
- Jowar Cucumber Roti Recipe: వెయిట్ లాస్‌కు సూపర్ ఫుడ్.. ఈ రొట్టె తింటే బరువు ఈజీగా తగ్గుతుంది..!
- Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!
- Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్‌గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!
మామిడి లస్సీకి కావలసిన పదార్థాలు
* బాగా పండిన మామిడి గుజ్జు – 1 కప్పు
* చిక్కటి తాజా పెరుగు – 1.5 కప్పులు
* పంచదార లేదా తేనె – రుచికి సరిపడా
* యాలకుల పొడి – అర టీస్పూన్
* ఐస్ క్యూబ్స్ – అవసరానికి తగినంత
* సన్నగా తరిగిన మామిడి ముక్కలు
* పిస్తా ముక్కలు (అలంకరణ కోసం)
తయారీ విధానం
ముందుగా మామిడి పండును శుభ్రంగా కడిగి తొక్క తీసి గుజ్జును వేరు చేయాలి. గుజ్జులో పీచు లేకుండా చూసుకోవాలి. తర్వాత బ్లెండర్ జార్లో మామిడి గుజ్జు, పెరుగు, పంచదార లేదా తేనె, యాలకుల పొడి వేసుకోవాలి. అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి బాగా బ్లెండ్ చేయాలి. మిశ్రమం నునుపుగా, క్రీమీగా మారే వరకు కలపాలి. ఇప్పుడు తయారైన లస్సీని పొడవాటి గ్లాసుల్లో పోసి పైపైగా మామిడి ముక్కలు, పిస్తా తురుము చల్లి చల్లగా సర్వ్ చేయాలి.
ఒక్కసారి తాగితే మళ్లీ మళ్లీ అడుగుతారు
మామిడి లస్సీ క్రీమీ టెక్స్చర్, మామిడి సువాసన ప్రతి గుక్కలోనూ అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. వేసవిలో ఇంటికి వచ్చిన అతిథులకు ఈ డ్రింక్ ఇస్తే ఖచ్చితంగా రెసిపీ అడుగుతారు. అంతేకాదండోయ్.. ఒక్క గ్లాస్‌తో ఆగకుండా ఇంకో గ్లాస్ కావాలనిపించే రుచితో ఇది అందరినీ ఆకట్టుకుంటుంది.
తాజావార్తలు
-
Easy Mango Lassi Recipe: క్షణాల్లో అదిరిపోయే మామిడి లస్సీ.. ఒక్క గ్లాస్‌తో ఆగరు అంతే..
-
Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
-
Soft Pink Lips Tips: మీ పెదాలు మృదువుగా.. గులాబీ రంగులో మెరిసిపోయే చిట్కాలు ఇవే..
-
Darling Re-release: రీ-రిలీజ్లో ‘డార్లింగ్’ విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
-
OMG: ఆడుకుంటూ గంగాళంలో ఇరుక్కున్న చిన్నారి.. చివరి ప్రయత్నంలో ఇలా..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!