Curd Upma Recipe: మండే ఎండల్లో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Curd Upma Recipe: మండే వేసవి వచ్చేసింది. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్దామంటే భయమేస్తోంది. భానుడి భగ భగలకు చేమటలు పట్టేస్తున్నాయి. ఈ టైమ్‌లో బయట ఎలాంటి ఫుడ్ తినాలన్నా భయమేస్తుంది. అందుకే ఇంట్లోనే బెస్ట్ ఫుడ్స్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ గురించి చూద్దాం.. శీతాకాలంలో రోజంతా ఎంతోకొంత తింటూనే ఉండాలనిపిస్తుంది, కానీ ఎండలు పెరిగే కొద్దీ మన కడుపు తేలికైన, చలువ చేసే ఆహారాన్ని కోరుకుంటుంది. ఈ వేసవి తాపాన్ని తట్టుకుంటూ శరీరానికి శక్తిని, మనసుకి హాయిని ఇచ్చే అద్భుతమైన అల్పాహారం పెరుగు ఉప్మా. ఉప్మా అంటే సాధారణంగా చాలా మందికి నచ్చదు. కానీ.. ఈ పెరుగు ఉప్మాను ఒక్కసారి ట్రై చేయండి. మళ్లీ మళ్లీ కావాలంటారు. పిల్లలకు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
కావలసిన పదార్థాలు:
సూజీ (ఉప్మా రవ్వ): 2 కప్పులు
పెరుగు: 1 కప్పు
నీళ్లు: 4 కప్పులు
తాలింపు దినుసులు: 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ మినప్పప్పు, 1 టీస్పూన్ శనగపప్పు
కరివేపాకు: 10-12 రెమ్మలు
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది)
కూరగాయలు: ½ కప్పు (క్యారెట్, బఠానీలు వంటివి మీ ఇష్టానుసారం)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి: 2 (నిలువుగా చీల్చినవి)
మసాలాలు: రుచికి సరిపడా ఉప్పు, కారం
అలంకరణకు: కొత్తిమీర
తయారీ విధానం:
ముందుగా ఒక బాణలిలో ఉప్మా రవ్వను తీసుకుని, మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో నెయ్యి లేదా నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు వేయాలి. పప్పులు వేగి చిటపటలాడుతున్నప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారాక, మీరు తీసుకున్న కూరగాయ ముక్కలను వేసి, మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కూరగాయలు ఉడికిన తర్వాత, ఒక కప్పు పెరుగు వేసి ఒక నిమిషం పాటు కలపాలి. ఆపై 4 కప్పుల నీటిని పోసి, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను ఉండలు కట్టకుండా మెల్లగా పోస్తూ కలుపుతూ ఉండాలి. రవ్వ నీటిని పీల్చుకుని దగ్గరపడే వరకు ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుని వేడివేడిగా వడ్డించండి.
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!