Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
- హోటల్ స్టైల్ పీతల బిర్యానీ ఇంట్లోనే
- పీతల మసాలా తయారీలో అసలు సీక్రెట్ ఇదే
- దమ్ బిర్యానీకి ఫాలో అవ్వాల్సిన ఈజీ ట్రిక్స్
- వీకెండ్ స్పెషల్‌గా ట్రై చేయాల్సిన సీఫుడ్ రెసిపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
crab biryani recipe telugu : సీఫుడ్ అనగానే చాలామందికి చేపలు లేదా రొయ్యలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, పీతలతో చేసే వంటకాల రుచి అమోఘం. ముఖ్యంగా మసాలాలు దట్టించిన పీతల బిర్యానీ (Crab Biryani) ఉంటే ఆ మజాయే వేరు. సాధారణంగా హోటల్స్‌లో మాత్రమే దొరికే ఈ నోరూరించే బిర్యానీని ఇంట్లోనే ఎంతో రుచిగా, సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు
ఈ బిర్యానీ తయారీకి అర కిలో శుభ్రం చేసిన పీతలు, రెండు కప్పుల బాస్మతీ బియ్యం, మూడు పెద్ద ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి), రెండు టమోటాలు, రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. మసాలా కోసం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా , బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వంటి హోల్ గరం మసాలా సిద్ధం చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, నూనె , నెయ్యి కూడా అవసరమవుతాయి.
Also Read
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
- Budda Parakalu Pulusu: తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసు.. ఈ ఒక్క టిప్ పాటిస్తే రుచి పీక్స్!
పీతల మసాలా తయారీ (గ్రేవీ)
ముందుగా పీతలను ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి పాన్ తీసుకుని అందులో నూనె, నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. అందులో హోల్ గరం మసాలా దినుసులు వేసి వేయించిన తర్వాత, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా , తగినంత ఉప్పు వేసి కలపాలి. మసాలా వేగాక శుభ్రం చేసిన పీతలను అందులో వేసి, మసాలా అంతా పీతలకు పట్టేలా ఐదు నిమిషాలు మగ్గించాలి. అర కప్పు నీళ్లు పోసి మూత పెట్టి పీతలను ముప్పావు వంతు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
బిర్యానీ రైస్ తయారీ , దమ్ చేయడం
మరోవైపు బాస్మతీ బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఎసరు కోసం ఎసరు నీళ్లలో బిర్యానీ ఆకు, షాజీరా, ఉప్పు వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగేటప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి 70 శాతం వరకు ఉడికించి, నీటిని వడకట్టాలి. ఇప్పుడు అసలైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని, ముందుగా తయారు చేసిన పీతల గ్రేవీని ఒక పొరలా వేయాలి. దానిపై ఉడికించిన అన్నాన్ని సమానంగా పరచాలి. పైన కొద్దిగా నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు (ఫ్రైడ్ ఆనియన్స్), పుదీనా, కొత్తిమీర చల్లాలి. గిన్నెపై మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా గోధుమపిండితో లేదా బరువైన వస్తువుతో సీల్ చేయాలి. చిన్న మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు దమ్ చేయాలి.
ధమ్ పూర్తయ్యాక స్టవ్ ఆపేసి మరో 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా మూత తీసి కింద నుంచి కలుపుతూ సర్వ్ చేసుకోవాలి. వేడివేడి పీతల బిర్యానీని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ , రైతాతో తింటే హోటల్ రుచిని మించిపోతుంది. పీతల లోపలి వరకు మసాలా వెళ్లి, అన్నం పొడిపొడిగా ఉండి అద్భుతమైన సువాసనతో ఈ బిర్యానీ మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ వీకెండ్లో మీరు కూడా ఈ స్పెషల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి!
తాజావార్తలు
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
-
Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!