పండ్లలో రారాజు మామిడిపండు. స్పెషల్ గా ఎండాకాలంలోనే వచ్చే మామిడి పండు తినానికి ఏడాదంతా వేచి చూస్తారు మామిడి ప్రియులు. టేస్ట్ లోనే కాదు ఆరోగ్య ప్రయోజనాల్లో కూడా రారాజే మామిడి. అలాంటి ఓ భారీ మామిడి పండును పండించి రికార్డు సృష్టించారు కొలంబియా రైతులు. కొలంబియాలోని గ్వాయత్ లో బోయాకే ప్రాంతంలోని శాన్ మార్టిన్ పొలంలో వారు ప్రపంచంలోనే అత్యంత భారీ మామిడిని పెంచారు. దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాలోని గ్వాయత్ లో నివసించే జెర్మేన్ ఓర్లాండో బరేరా, రీనా మరియా అనే ఇద్దరు రైతులు 4.25 కిలోల మామిడికాయను పండించారు. ప్రపంచంలో ఇదే అతి పెద్ద, అత్యంత్య భారీ మామిడి. అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో కూడా చోటు దక్కించుకుంది. మునుపటి రికార్డు 2009లో ఫిలిప్పీన్స్ లో పండిన 3.435 కిలోల మామిడి పేరుతో ఉండేది. గ్వాయత్ కు ఇది రెండవ గిన్నిస్ రికార్డు అని తెలుస్తోంది. 2014లో 3,199 చదరపు మీటర్ల ఎత్తులో ఉన్న పొడవైన సహజ పూల కార్పెట్ రికార్డును సాధించింది ఆ ప్రాంతం.