Butter Curd Rice : దక్షిణ భారత దేశంలో భోజనం ముగింపులో పెరుగు అన్నం లేనిదే ముద్ద దిగదు. సాధారణ పెరుగు అన్నం కంటే భిన్నంగా, మరింత రుచిగా, క్రీమీగా ఉండే వంటకమే ‘బటర్ కర్డ్ రైస్’. వెన్న, పెరుగు, పాలు , డ్రై ఫ్రూట్స్ కలయికతో చేసే ఈ వంటకం కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి చలవను కూడా ఇస్తుంది. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో లేదా అతిథులు వచ్చినప్పుడు తక్కువ సమయంలోనే ఈ స్పెషల్ డిష్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
UstaadBhagatSingh : ధురంధర్ – 2కు జై.. ఉస్తాద్ ను పట్టించుకోని టాలీవుడ్ స్టార్స్.. ఫ్యాన్స్ ఫైర్
కావలసిన పదార్థాలు:
ముందుగా ఒక కప్పు ఉడికించిన అన్నం, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు పాలు , సుమారు 100 గ్రాముల వెన్న (Butter) సిద్ధం చేసుకోవాలి. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు అవసరమవుతాయి. రుచిని పెంచడానికి జీడిపప్పు, కిస్‌మిస్ , పైన అలంకరించుకోవడానికి దానిమ్మ గింజలు, కొత్తిమీర తీసుకోవాలి.
తయారీ విధానం:
డ్రై ఫ్రూట్స్ వేయించడం: ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీడిపప్పును బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ఆపై కిస్‌మిస్ కూడా వేసి ఒక్క నిమిషం పాటు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
తాలింపు : అదే బాండీలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు , పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. చివరగా కరివేపాకు వేసి చిటపటలాడాక స్టవ్ ఆపేయాలి.
అన్నం కలపడం: ఒక వెడల్పాటి గిన్నెలో ఉడికించిన అన్నాన్ని తీసుకుని చల్లారనివ్వాలి. అన్నం మెత్తగా ఉంటే రుచి ఇంకా బాగుంటుంది. అందులో పెరుగు , పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
వెన్న , ఇతరాలు: ఇప్పుడు ఈ మిశ్రమంలో వెన్న (Butter) వేసి బాగా కలపాలి. వెన్న అన్నంలో కలిసిపోయి మంచి క్రీమీ టెక్స్చర్‌ను ఇస్తుంది. అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్న తాలింపు, వేయించిన డ్రై ఫ్రూట్స్ , దానిమ్మ గింజలను అన్నంలో వేయాలి.
చివరిగా: తగినంత ఉప్పు వేసి, సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరిస్తే కమ్మని బటర్ కర్డ్ రైస్ సిద్ధం..
ఈ బటర్ కర్డ్ రైస్ మధ్యాహ్న భోజనంలో అమృతంలా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. పాలు, పెరుగు , వెన్న ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి..
Netanyahu: ఇరాన్ అణుశక్తిని నాశనం చేశాం.. పుకార్ల మధ్య నెతన్యాహు ప్రెస్‌మీట్
