Carrot Recipes: మీ పిల్లలు ఆహారం తినడం లేదా..? క్యారెట్‌తో ఇలా తయారు చేసి పెట్టండి
- చలికాలంలో మీ పిల్లలు ఆహారం తినడం లేదా..?
- చలికాలంలో జలుగు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు
- పిల్లలకు క్యారెట్‌తో తయారు చేసిన వంటకం ఆరోగ్యానికి మంచిది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలంలో మీ పిల్లలు ఆహారం తినడం లేదా..? ఒక పక్క సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతూ.. ఆహారం తినడానికి ఇష్టపడరు. చలికాలంలో జలుగు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు పిల్లలతో పాటు పెద్దలను కూడా ఇబ్బందికి గురి చేస్తాయి. ఇలాంటి సమయంలో పిల్లలకు క్యారెట్‌తో తయారు చేసిన వంటకం ఆరోగ్య పరంగా మంచిది. ఇది రుచితో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో పిల్లలకు క్యారెట్‌తో ఎలాంటి ఆహారాలు తయారు చేసి పెట్టాలో తెలుసుకుందాం..
Andhra Pradesh: ఏపీలోని నాలుగు పంచాయతీలకు అవార్డులు.. అభినందించిన పవన్ కల్యాణ్
Also Read
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
క్యారెట్ పరాటా:
క్యారెట్ పరాటా ఆరోగ్యకరమైన అల్పాహారం. చలికాలంలో ఉదయాన్నే పిల్లలతో పాటు పెద్దలు తింటే ఆరోగ్యానికి మంచిది. క్యారెట్ పరాటాలో పన్నీర్ లేదా ఉడికించిన బంగాళదుంపలతో తయారు చేస్తారు. క్యారెట్ పరాటా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని పెరుగు లేదా చట్నీతో తినవచ్చు.
క్యారెట్ ఖీర్:
చలికాలంలో తీపి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని అనుకుంటే.. క్యారెట్‌తో తయారు చేసిన ఖీర్ బెస్ట్. ఇది రుచిగా ఉండటమే కాకుండా పోషకాహారంతో కూడుకున్న ఆహారం. దీనిని క్యారెట్, పాలు, చక్కెర, నెయ్యి, మావా, డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేస్తారు. ఇందులో కుంకుమపువ్వు కూడా వేస్తారు. క్యారెట్ ఖీర్ ఎక్కువగా పిల్లలు తినడానికి ఇష్టపడతారు.
క్యారెట్ కూర:
రోజూ క్యాబేజీ, బఠానీలతో తయారు చేసిన కర్రీస్ తిని బోర్ కొడితే చలికాలంలో క్యారెట్ వెజిటేబుల్ ట్రై చేయండి. ఇది తేలికపాటి, ఆరోగ్యకరమైన వంటకం. దీన్ని బంగాళదుంపలతో కలిపి తయారు చేసుకోవచ్చు. క్యారెట్ కూరను రోటీ, పరాటా లేదా పూరీలో తినవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది.
క్యారెట్‌తో చేసిన స్వీట్:
క్యారెట్ హల్వా అంటే అందరికీ ఇష్టమే. వింటర్ సీజన్లో వేడి వేడి క్యారెట్ హల్వా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ హల్వా.. తురిమిన క్యారెట్లు, పాలు, నెయ్యి, మావా, డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేస్తారు. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు.
క్యారెట్ పులావ్:
చలికాలంలో క్యారెట్ పులావ్ తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. క్యారెట్, బఠానీ పులావ్ తినడానికి రుచికరమైనది మాత్రమే కాదు.. పోషకాహారాన్ని కూడా కలిగి ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. క్యారెట్ పులావ్ పిల్లలకు తినిపిస్తే ఆరోగ్యానికి మంచిది.
- Tags
- carrot
- eating
- Health
- Kids
- telugu news
తాజావార్తలు
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
-
Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?