NTV Telugu Site icon

Health: మొలకలు వచ్చిన ఆలుగడ్డ తింటున్నారా..? ఎంత ప్రమాదకరమంటే

Sprouted Potatoes

Sprouted Potatoes

ప్రతి అందరి ఇళ్ల కిచెన్‌లో బంగాళదుంపలు (ఆలుగడ్డ) ఖచ్చితంగా ఉంటాయి. బంగాళదుంప కర్రీ నుంచి మొదలు పెడితే.. సాంబారు, పులుసు ఇలా దీనిని వాడేస్తారు. బంగాళాదుంప కర్రీ అంటే కొంత మందికి ఇష్టముంటుంది.. కొంత మందికి ఉండదు. బంగాళ దుంపళలతో రకరకాల టేస్టీ టేస్టీ వంటకాలు చేసుకుని తింటుంటాం. అయితే కొన్నిసార్లు బంగాళాదుంపలపై మొలకలు వస్తాయి. అయితే ఈ మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల మన ఆరోగ్యంపై చాలా ప్రభావాలు ఉన్నాయని మీకు తెలుసా. మొలకెత్తిన బంగాళదుంపలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

Mangaluru: ఇదెక్కడి మాస్ రా మావా.. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లను మభ్యపెట్టి.. రూ.1.29 కోట్ల దోపిడీ..

మొలకెత్తిన బంగాళదుంపలు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం..?
బంగాళాదుంపను కర్రీ వండకుండా చాలా రోజులు ఇంట్లో ఉంచడం వల్ల దాని నుండి మొలకలు వస్తాయి. అందుకే వాటిని ఎప్పుడూ బహిరంగ ప్రదేశంలో ఉంచాలి. అలా అయితేనే బంగాళదుంపలు పాడు కాకుండా, మొలకెత్తకుండా ఉంటాయి. అయితే.. మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల కళ్ళు వాపులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బంగాళాదుంపలు మొలకెత్తే ప్రక్రియ హానికరం.. బంగాళాదుంప మొలకెత్తిన తర్వాత, దాని పోషక విలువ తగ్గుతాయి. బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి వల్ల మొలకెత్తుతాయి. దాని వల్ల కొన్ని విషపూరిత సమ్మేళనాలు అందులో ఉత్పత్తి అవుతాయి. మొలకెత్తిన బంగాళాదుంపల్లో గ్లైకోఅల్కలాయిడ్స్ అని పిలువబడే సహజ విష సమ్మేళనాలను కలిగి ఉంటాయి. మొలకెత్తిన బంగాళదుంపలలో సోలనిన్, చాకోనిన్ అనే రెండు గ్లైకోఅల్కలాయిడ్స్ ఉంటాయి.

వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి ప్రమాదం:
గ్లైకోలాయిడ్స్ తెగుళ్లు ఉండే బంగాళదుంపలు తిన్నట్లైతే వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వస్తుంది. అంతేకాకుండా.. తలనొప్పి సమస్య కూడా పెరుగుతుంది.

షుగర్ రోగులకు హానికరం:
మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మొలకెత్తిన బంగాళదుంపలను తినకూడదు. ఒకవేళ తిన్నట్లైతే చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది.

Show comments