Fat Loss: బరువు తగ్గాలను కుంటున్నారా? ఈ నియమాలు పాటించండి..
- అధిక బరువు వల్ల అనేక వ్యాధులు
- వ్యయామం.. సమతుల్య ఆహారంతో సమస్య దూరం
- జీవనశైలిలో మార్పులతో కొవ్వును శాశ్వతంగా తగ్గించుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధిక బరువు చాలామంది మహిళల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఉబకాయం వల్ల ఇంటి, ఆఫీసు పనులు సరిగా చేసుకోలేకపోతున్నారు. కొందరిది కూర్చుంటే లేవలేని పరిస్థితి. మరికొందరు అడుగుతీసి అడుగు వేయలేకపోతున్నారు. బరువు తగ్గాలంటే పండ్లు, కూరగాయలు, బాదంపప్పు వంటి ఆహారాలతో సహా సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఎక్సర్‌సైజ్ చేయడం, జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా కూడా కొవ్వును శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. శరీరం చక్కగా పని చేయడానికి, బరువు తగ్గడానికి హైడ్రేటెడ్‌గా ఉండాలి. వాటర్ తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల ఎక్కువగా తినలేరు. నీటి శాతం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. హెర్బల్ టీలు తాగాలి. వారానికి కనీసం 150 నిమిషాలు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్ చేయాలి.
READ MORE: Srinivas Goud: నీటి వాటా, ఆస్తుల విషయంలో సీఎం రేవంత్ గట్టిగా నిలబడాలి..
Also Read
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
75 నిమిషాలు హై ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్ తప్పనిసరి. నడక, పరిగెత్తడం, ఈత, సైక్లింగ్, డ్యాన్స్ వంటివి కార్డియో వ్యాయామానికి కొన్ని ఉదాహరణలు. వ్యాయామం చేయడం, బరువులు ఎత్తడం, ఇతర ఎక్సర్‌సైజ్‌లు చేస్తే మజిల్స్, మెటబాలిజం పెరిగి, శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గడానికి, బాడీలో ఫ్యాట్ కరగడానికి ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. బాదం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతాయి. డైజెషన్‌కు కూడా మంచివి. ఆకలితో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ కాకుండా బాదంపప్పు వంటి నట్స్ తినాలి. దీంతో ఆకలి, కేలరీల ఇన్‌టేక్ తగ్గుతుంది. దీనివల్ల శరీర కొవ్వును వదిలించుకోవడం ఈజీ అవుతుంది. మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే తినడం, తాగడంపై పూర్తిగా దృష్టి పెట్టడం. భోజనాన్ని మరింత ఎంజాయ్ చేయవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి బరువు పెరగడానికి కారణమవుతుంది. బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది. ఒత్తిడిని బాగా మేనేజ్ చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. ధ్యానం, యోగా లేదా డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. ఈ నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!