ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. లైఫ్ స్టైల్ మారడం, ఆహార విధానంలో మార్పులు రావడం వల్ల చాలా ఈజీ వెయిట్ పెరిగిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితం బరువు తగ్గడమనేది ఛాలేంజింగ్‌గా మారింది. బరువు తగ్గాలనే తపన ఉన్న ఆహారపు అలావాట్ల వల్ల అది సాధ్యపడటం లేదు. కొందరు తరచూ ఏదోక ఫుడ్ తింటూ ఉంటారు. తమకు నచ్చిన ఫుడ్ కనిపించగానే డైట్‌ను పక్కన పడేస్తు్న్నారు.
Also Read: Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ సూసైడ్ చేసుకుంటే వాళ్ళే కారణం.. సీపీఐ నారాయణ సంచలన వీడియో విడుదల
అలాంటి వారు చూయింగ్ తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనే తమ కొరిక తీర్చుకోవచ్చని తాజా సర్వేలు చెబుతున్నాయి. నిజానికి చూయింగ్ గమ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చిన్న పిల్లలు ఇష్టంగా చూయింగ్ తింటే పెద్దవాళ్లు మాత్రం టైంపాస్ కోసం దాన్ని నములుతుంటారు. మరికొందరు నోటి దుర్వాసన పొగొట్టేందుకు చూయింగ్ నోట్లో వేసుకుంటారు. ఆ అలవాటు వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని ఓ రీసెర్చ్‌లో తేలింది.
చూయింగ్ గమ్ నమలడం వల్ల శరీరంలో కేలరీలను కూడా బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చూయింగ్ గమ్ తింటున్నప్పుడు కింది దవడ అనేది కదులుతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొద్ది మోతాదులో కేలరీలు బర్న్‌ను అవుతాయట. అలాగే సాధారణం ఆహారం తర్వాత చాలామంది స్వీట్ పదార్థాలు తినాలనిపిస్తుంది. అలా అనిపించగానే ఐస్ క్రీం, స్వీట్స్ తీసుకుంటారు. ఆ అలవాటు కారణంగా వెయిట్ పెరుగుతూ ఉంటారు.
Also Read: Pallavi Prashanth: బిగ్ బాస్ పరువు తీసిన ఏకైక మొనగాడు.. ?
అప్పుడు చూయింగ్ గమ్ తింటే వెయిట్ లాస్‌కి హెల్స్ అవుతుందంటున్నారు. ఆహారం తర్వాత చూయింగ్ గమ్ తినడం వల్ల అలాంటి కోరికలను కంట్రోల్ అవుతాయట. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే పదే పదే చిరు తిండి తినే వారు కూడా తప్పకుండా చూయింగ్ గమ్ తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో చిరు తిండి తినాలన్న ఆలోచన నశిస్తుంది. ఈ విధంగా చూయింగ్ గమ్ తో ఈజీగా బరువు తగ్గొచ్చు.