ఈ మధ్యకాలంలో మనుషులకు ఆరోగ్యం పై శ్రద్ద పెరిగిపోయింది.. ఉదయం మొదలుకొని పడుకొనేవరకు హెల్త్ కోసం డైట్ ను ఫాలో అవుతున్నారు.. ఇందులో భాగంగా ఎక్కువ మంది బ్రౌన్ బ్రెడ్, సలాడ్స్ వంటివాటిని తీసుకుంటున్నారు.. ఇటీవల కాలంలో దీని వినియోగం మన దేశంలో ఎక్కువగా పెరిగింది పోయింది.. బ్రౌన్ బ్రెడ్ తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో, ఈవినింగ్ స్నాక్ రూపంలో ఇలా బ్రెడ్ ను తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా.. చాలా మంది టిఫిన్ గా బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ లా కానీ, ఆమ్లెట్ తో సరి పెట్టుకుంటున్నారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. బ్రెడ్ లో ఎక్కువగా మైదా ఉంటుంది.. ఈ బ్రెడ్ ను తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఆ సమస్యలేంటి ఒకసారి చూసేద్దాం..
వైట్ బ్రెడ్ తినడం అంత సేఫ్ కాదు. వైట్ బ్రెడ్ లో విటమిన్స్, మినరల్స్, పోషకాలు పెద్దగా ఏమీ ఉండవు. వైట్ బ్రెడ్ లో మైదాను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫైబర్ కూడా ఉండదు.. దాని కారణంగా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.. అందుకే బ్రౌన్ బ్రెడ్ బెస్ట్.. అది కూడా లిమిట్ గానే తీసుకోవాలి..
బ్రౌన్ బ్రెడ్ లో మల్టీ గ్రెయిన్ తీసుకోవాలి. ఇందులో జింక్, కాపర్, ఐరన్, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె జబ్బులు రాకుండా చేస్తుంది..
బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే గోధుమ పిండిలోని పీచు పదార్థం పేగు కదలికలకు సహాయపడుతుంది. కాబట్టి జీర్ణ క్రియ, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి..
ప్రతి రోజూ రెండు లేదా మూడు బ్రెడ్ ముక్కలను తీసుకోవడం మంచిది.. అంతకన్నా ఎక్కువ తింటే అరగదు.. శరీరానికి కావాల్సిన విటమిన్ కే, ఈ, బీ, కార్బొహైడ్రేట్లు, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి. లేని పోని ఆనారోగ్య సమస్యలు వస్తాయి..
బ్రౌన్ బ్రెడ్ లో ధాన్యం ఉంటుంది కాబట్టి.. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
ఇక ఈ బ్రెడ్ ను గోధుమలు, నీళ్లు, ఉప్పు, చక్కెర, ఈస్ట్ ని ఉపయోగించి తయారు చేస్తారు. ఇవన్నీ ప్యాకెట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి.. సో అది మంచిది కదా అని కుమ్మేయ్యిద్దు.. లిమిట్ గా తీసుకుంటే చాలా మంచిది..