మునగకాయ అనేక సమస్యలకు దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. వివిధ రకాల వంటలలో విరివిగా వాడుకునే మునక్కాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ చెట్టు వేరు నుంచి ఆకు వరకు ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే దీనిని ‘జీవన వృక్షం’ అని కూడా పిలుస్తారు. మునక్కాయలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగకు ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ముఖ్యంగా మహిళలకు మునక్కాయ అనేక విధాలుగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మునగకాయ మహిళలకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందో తెలుసుకుందాం.
Covid-19: కరోనా సోకినా కొందరు ఎందుకు సేఫ్‌గా ఉంటున్నారు..? కారణం తెలిసింది..
ఎముకలను బలపరుస్తాయి
30 ఏళ్ల తర్వాత మహిళల్లో ఎముకలు బలహీనపడతాయి. ఆ క్రమంలో.. మునగ వాటిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో పాల కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. కాల్షియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకల సాంద్రతను పెంచుతుంది.
బరువు నిర్వహణలో ఉపయోగపడుతుంది
ఈ రోజుల్లో చాలా మంది మహిళలు బరువు పెరగడం వల్ల ఆందోళన చెందుతున్నారు. అటువంటి పరిస్థితిలో.. మునక్కాయ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది కొవ్వు విచ్ఛిన్నానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. జీవక్రియ రేటును పెంచుతుంది.. కేలరీలను బర్న్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది.
గర్భిణీ స్రీలకు మంచిది
ప్రసవం తర్వాత స్త్రీలకు మునక్కాయ చాలా ప్రయోజనకరం. ఇందులో పొటాషియం, బీటా కెరోటిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలో.. ప్రసవం తర్వాత స్త్రీలకు చనుబాలివ్వడానికి మేలు చేస్తుంది.
హార్మోన్లను సమతుల్యం చేస్తాయి
శరీరంలోని ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే కొన్ని సమ్మేళనాలు మునక్కాయలో ఉంటాయి. ఈ క్రమంలో.. హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయం చేస్తుంది.
పీరియడ్స్ క్రాంప్‌లలో సహాయపడుతుంది
చాలా మంది మహిళలు ప్రతి నెలా పీరియడ్స్ వల్ల వచ్చే తిమ్మిరి వల్ల ఇబ్బంది పడుతుంటారు. అటువంటి పరిస్థితిలో.. మునక్కాయను తినడం వల్ల తిమ్మిరి నుండి ఉపశమనం పొందవచ్చు. పీరియడ్స్ సమయంలో మునగ ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
చర్మాన్ని మెరిసేలా చేస్తాయి
మునగ ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ‘ఎ’ కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది. కొల్లాజెన్ ఒక ప్రోటీన్.. ఇది చర్మం స్థితిస్థాపకతను పెంచి.. శర్మాన్ని మెరిసేలా చేస్తుంది.