మునగకాయ అనేక సమస్యలకు దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. వివిధ రకాల వంటలలో విరివిగా వాడుకునే మునక్కాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ చెట్టు వేరు నుంచి ఆకు వరకు ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే దీనిని 'జీవన వృక్షం' అని కూడా పిలుస్తారు. మునక్కాయలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.