Donkey Milk: గత కొద్ది కాలంగా గాడిద పాలు (Donkey Milk) ఆరోగ్య, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీ పరిశ్రమలలో విశేష ప్రాధాన్యతను పొందుతున్నాయి. ఇది ఆశ్చర్యంగా అనిపించినా.. ప్రాచీన కాలం నుండి పలు సంస్కృతులలో ఉపయోగంలో ఉన్నది. ఈజిప్టు రాణి క్లియోపాత్రా ఈ పాలను సౌందర్య రహస్యంగా ఉపయోగించేదని చరిత్ర చెబుతోంది. అయితే ప్రస్తుతకాలంలో గాడిద పాలు ఆరోగ్యానికి వాస్తవంగా మంచివేనా? లేదా..? అనే సమాధానం తెలుసుకుందాం.
గాడిద పాలలో తక్కువ కొవ్వు, తక్కువ కాలరీలు, అధిక లాక్టోస్, A, B1, B2, B6, C, D, E విటమిన్లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో లైసోజైమ్, లాక్టోఫెరిన్ అనే యాంటీ మైక్రోబియల్ ఎంజైములు కూడా ఉంటాయి. ఇక గాడిద పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి పరిశీలించినట్లైతే..
CIBIL: ఇకపై లోన్లకు CIBIL అవసరం లేదా..? కొత్త వ్యవస్థకు కేంద్రం ప్లాన్..
గాడిద పాలులోని పెప్టైడ్స్, విటమిన్ C వల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకే గాడిద పాలను ఉపయోగించి తయారుచేసే సబ్బులు, క్రీములు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. అలాగే పాలలో ఉండే సహజ యాంటీ బయోటిక్ గుణాలు శరీర రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఇకపోతే, కొందరికి గాడిద పాలు పశు పాలతో పోలిస్తే తక్కువ అలర్జీ సమస్యల్ని కలిగిస్తాయి. అయితే గాడిదపాలు జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉంటాయి. ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, జీర్ణ సమస్యలతో బాధపడే వారికి అనుకూలంగా ఉంటుంది.
ఇక ఉపయోగాలు ఇలా ఉన్నా.. మరోవైపు సమస్యలు కూడా లేకపోలేదు. గాడిదల నుండి పాలు తక్కువ మొత్తంలో వచ్చే కారణంగా ఇది అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి. సాధారణ మార్కెట్లలో వీటి లభ్యం చాలా తక్కువ. అలాగే పూర్తి లాక్టోస్ ఇంటోలరెన్స్ ఉన్నవారు వీటిని తాగాలంటే వైద్య సలహా తీసుకుని ఉపయోగించాలి. ఈ పాలు త్వరగా పాడవుతాయి. ఫ్రీజ్ లేకపోతే నిల్వ ఉంచడం కష్టం.
Pakistani Reporter: రిపోర్టింగ్ చేయి తప్పులేదు.. కానీ ఇంత అవసరం లేదుగా..!
నిజంగానే ఆరోగ్యానికి మేలు చేసే పాలు అని చెప్పలేము కానీ.. ముఖ్యంగా చర్మ ఆరోగ్యానికి, ఇమ్యూనిటీకి, జీర్ణానికి ఉపయోగపడుతుంది. అయితే వీటి ధర అధికంగా ఉండడం, లభ్యత తక్కువగా ఉండడం వల్ల అందరికీ అందుబాటులో ఉండవు. మీరు వీటిని ఉపయోగించాలనుకుంటే, ముందుగా డాక్టర్ లేదా న్యూట్రిషనిస్టు సలహా తీసుకోవడం మంచిది.