Site icon NTV Telugu

Health Tips: మూత్రంలో రక్తం పడితే.. క్యాన్సర్ వచ్చినట్టా?

Blood In Urine

Blood In Urine

క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తుంటారు. వాస్తవంగా చాలా రకాల క్యాన్సర్లు తీవ్రంగా ముదరకముందే గుర్తించి చికిత్సను తీసుకోవడం ద్వారా రోగులు ప్రాణాలతో బయటపడుతున్నారు. సమస్యేంటంటే ఈ వ్యాధి సోకిన చాలా మంది డాక్టర్లు చెప్పే మాటలు సరిగా వినిపించుకోవడం లేదు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగలిగే కొన్ని రకాల లక్షణాలను కూడా రోగులు పట్టించుకోవడం లేదు.

READ MORE: Rahul Gandhi: ‘‘లిక్కర్ స్కామ్‌కి సూత్రధారి’’.. కేజ్రీవాల్‌పై రాహుల్ గాంధీ విమర్శలు..

ఇదిలా ఉండగా.. మూత్రంలో రక్తం పడితే క్యాన్సర్ వచ్చినట్లే అని కొందరు భావిస్తుంటారు. కానీ ఈ వాదనను నిపుణులు కొట్టేస్తున్నారు. మూత్రంలో రక్తం పడటానికి చాలా కారణాలుంటాయి. మూత్రంలో ఒక చుక్క రక్తం కలిసినా ఎక్కువగా కనిపిస్తుంది. మూత్రంలో రక్తం కనిపించడానికి ప్రధాన కారణం కిడ్నీలో రాళ్లు. ఆ రాయి జారి పైపులో ఇరుక్కొని పోయినపుడు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినపుడు మంట, ఒక్కోసారి రక్తం కూడా రావొచ్చు. కిడ్నీలో నుంచి రాయి వచ్చి బ్లాడర్‌లోకి రావడంతో కూడా రక్తం వస్తుంది. కిడ్నీ నుంచి బ్లాడర్‌ దాకా ఎక్కడైనా ట్యూమర్‌ వచ్చినా దానితో కూడా మూత్రంలో రక్తం వస్తుంది. బ్లడ్‌క్లాట్‌ కాకుండా మందులు వాడేవారు, స్టంట్‌ వేసుకున్నపుడు కూడా రక్తం వస్తుంటుంది. దీంతో పాటు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినపుడు మంట, ఒక్కోసారి రక్తం కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

READ MORE: Tamil – Telugu: తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒకేరోజు తమిళ సూపర్ హిట్- డిజాస్టర్ సినిమాలు

Exit mobile version