మనకు ఎవరైనా నచ్చకుంటే వారిని వెంటనే దూరం పెడతాము.. ఇంకా వారిని పూర్తిగా దూరం పెట్టాలని వారికి ఫోన్ నంబర్స్ ను బ్లాక్ చేస్తాము..అన్ బ్లాక్ చేస్తుంటారు. అవతలి వారితో స్నేహం, ప్రేమ అనే అంశాల్లో రిలేషన్ కంటిన్యూ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండిపోతారు. ఈ పరిస్థితి తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. మీకు హాని కలిగించిన.. బాధించిన బంధాల నుంచి బయటపడాలనే బలమైన నిర్ణయం తీసుకుంటేనే బ్లాక్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం సరైనదని సూచిస్తున్నారు. లేదంటే ఒత్తిడికి లోనవడం .. డిప్రెషన్‌కి వెళ్లడం లాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.. ఆలోచనలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది..
బ్లాక్ చెయ్యడం కన్నా మాట్లాడకుండా ఉండటం బెస్ట్.. బ్లాక్ చేస్తే అవతలి వాళ్ల మనసు దెబ్బతింటుంది బ్లాక్ చేయడం అంటే అవతలి వ్యక్తిని తమ జీవితం నుంచి దూరం పెట్టినట్లే. కొందరిలో బ్లాక్ చేయడం అనేది ఒక రకమైన వీక్ నెస్ గా చెప్పాలి. వారి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక బ్లాక్ చేస్తుంటారు. కొందరు అనాలోచితంగా కోపంలో తొందరపడి స్నేహితుల్ని బ్లాక్ చేస్తుంటారు. కోపం తగ్గగానే గిల్టీగా ఫీలై అన్ బ్లాక్ చేస్తుంటారు. బ్లాక్ చేయడం.. అన్ బ్లాక్ చేయడం ఒక ఆటలాగ సాగితే ఇతరులకు మీమీద నమ్మకం పోతుంది. మీ మధ్య దూరం పెరిగిపోతుంది. మంచి స్నేహం మధ్య బ్లాక్ చేయడం అనేది బ్రేకప్‌కి దారి తీసిన ఆశ్చర్యం లేదు.అందుకే ఆలోచించండి..
అదేవిదంగా లవ్ బ్రేకప్ అయిన వాళ్ళు కూడా ఒకరినొకరు బ్లాక్ చేసుకుంటారు.. ఇది వారికి మంచిదే..గతంలో వారు గడిపిన క్షణాలు గుర్తుకు రాకుండా ఉంటాయి.. ఒకరి అకౌంట్స్ మరొకరికి కనిపిస్తున్నంత సేపు గతం గాయం చేస్తూ ఉంటుంది. దాని కంటే ఒకరినొకరు మర్చిపోవాలంటే బ్లాక్ చేయడం బెటర్. అయితే ఒకరిని బ్లాక్ చేసేముందు ఆవేశంలో తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకోకుండా కాస్త టైం తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి కోల్పోయిన స్నేహమైనా.. ప్రేమైనా తిరిగి రాదు. బ్లాక్ బటన్ నొక్కి తలుపులు మూసేస్తే అవి ఇంక ఎప్పటికీ తెరుచుకోవు.. పూర్తిగా వదిలెయ్యాలి అనుకుంటే మాత్రం ఇలా చెయ్యాలి.. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి.