పెళ్లి.. ఇది కేవలం మూడు ముళ్ల బంధమే కాదు.. దశాబ్దాల జీవిత పయనం.. వేరే అంశాల్లో ఏమైనా తప్పులు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందేమో కాని.. జీవిత భాగస్వామి ఎంపికలో తప్పు చేస్తే జీవితాంతం నరకం తప్పదు. ఒక వేళ వాళ్లని విడాకుల ద్వారా వదిలించుకున్నా.. ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. అందుకే ముందగానే జాగ్రత్త పడి నిర్ణయం తీసుకోవాలి. పెళ్లి చేసుకోబోయే వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ఇదిలా ఉండగా.. మనం ప్రస్తుతం భాగస్వామిని ఎంచుకునే విషయంలో అమ్మాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
READ MORE: Maulana Shahabuddin: మోడీ, యోగి ‘అఖండ భారత్’ కలని నేరవేర్చగలరు..
స్వార్థం: ప్రస్తుతం సమాజంలో స్వార్థం నిండిపోయింది. స్వార్థపరులు కేవలం తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇలా ఆలచోచించే వాళ్లు.. ఏదైనా అనుకోని సమస్యలు, గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు నట్టేట ముంచేస్తారు. అందుకే ఎవరికైనా ఇబ్బంది కలిగించినా పట్టించుకోకుండా ఉంటారు. ముందుగా మీ బాయ్ ఫ్రెండ్ లో ఇలాంటి లక్షణం ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నించండి.. ఒక వేళ ఉంటే మాత్రం ఇప్పుడే వదిలేయడం మంచిది.
READ MORE:BSNL: బీఎస్‌ఎన్ఎల్ కొత్త ప్లాన్ వచ్చేసింది! వివరాలు ఇవే..!
మోసగాళ్లు: కొందరు చిన్నచిన్న విషయాలను దాస్తూ.. అబద్ధాలు చెబుతూ.. మోసం చేస్తుంటారు. ముందుగా వాళ్లు చెప్పే అబద్ధం వెనుక ఆంతర్యాన్ని తెలుసుకోండి. మంచి కోసం అలా చెప్పాల్సి వచ్చిందా లేదా ఏదైనా దాస్తూ.. మోసం చేస్తున్నారా గమనించండి. మీరు పెళ్లి చేసుకునే వ్యక్తి మోసం చేస్తుంటే అతడిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వారు మిమ్మల్ని ఎప్పుడైనా మోసం చేయవచ్చు.
READ MORE:Headache: ఉదయం లేవగానే తలనొప్పి వస్తోందా..? కారణాలివే
అబద్ధం: మీరు ఎంచుకున్న వ్యక్తి ఒకవేళ చాలా సందర్భాల్లో అబద్ధాలు చెబుతుంటే.. కనిపెట్టండి. ఓ నివేదిక ప్రకారం.. మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అన్ని విషయాల్లో అబద్ధాలకోరు అయితే.. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. అలాంటివారు రహస్యాలను దాచిపెట్టి జీవితాన్ని నరకం చేసుకుంటారు. అబద్ధం చాలా సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండండి. పెళ్లికి ముందే తెలుసుకొని దూరంగా ఉంటే మంచిది.
READ MORE:Strange Tradition: ఇదెక్కడి ఆచారం.. ఈ తెగలో తండ్రి కూతురిని పెళ్లి చేసుకుంటాడట?
వయస్సు అంతరం: భారతీయ సమాజంలో వివాహం ఒక పవిత్ర బంధం. ఇది ఏడు జన్మల బంధం అంటారు. కానీ మారుతున్న సమాజంలో పెళ్లి గురించి, అనేక సంప్రదాయాల గురించి ప్రజల ఆలోచనలు మారాయి. మన సమాజంలో కుదిరిన వివాహాలు సర్వసాధారణమైనప్పటికీ నేటి యువ తరం ప్రేమ వివాహాల వైపు ఆకర్షితులవుతున్నారు.
READ MORE:Viral News: రూ. 10వేల కూలీకి.. రూ.2 కోట్లకు పైగా పన్ను కట్టాలని నోటీసులు
స్థిరత్వం లేకపోవడం: జీవితంలో లక్ష్యం లేని వ్యక్తిని వివాహం చేసుకోవడం మానసిక కుంగుబాటుకు దారితీస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. వారికి నిబద్ధత, స్థిరత్వం ఉండవు. ఇలాంటి వ్యక్తి గడిచిన జీవితం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ.. భాధపడుతూ సమయాన్ని వృథా చేస్తుంటారు. భవిష్యత్తు గురించి ఆచోచించ కుండా గతాన్నే తవ్వే వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. ఒక వేళ మీరు మార్చగలిగితే మార్చండి లేదా విడిపోవడం బెటర్ అని అభిప్రాయం. ఇవి కేవలం ప్రాథమిక అలవాట్లు మాత్రమే ఇలాంటి అవాట్లు మీ బాయ్ ఫ్రెండ్ కి ఉన్నాయా? లేదా ఒకసారి చెక్ చేసుకోండి..