Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Tips: దివాళి పండుగ అనగానే మనందరికీ ముందుగా గుర్తువచ్చేది మట్టి ప్రమిదలతో (Clay Diyas) ఇళ్లు కళకళలాడటమే. ప్రతి ఒక్కరూ మార్కెట్ నుంచి కొత్త ప్రమిదలు తెచ్చి, ఇంటి గుమ్మంలో, పూజా గదిలో, బాల్కనీలో వెలిగిస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ప్రమిదల్లో పోసిన నూనె (Oil) క్షణాల్లో అయిపోతుంటుంది, దాంతో దీపాలు త్వరగా ఆరిపోతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే, దీపాలు వెలిగించే ముందు వాటిని కొద్దిసేపు నీటిలో నానబెట్టడం (Water Soaking) చాలా ముఖ్యం. ఇది నూనెను ఆదా చేసే ఒక చక్కటి పాతకాలపు ఇంటి చిట్కా (Desi Hack).
కొత్తగా మార్కెట్ నుంచి తెచ్చిన మట్టి ప్రమిదలను నేరుగా నూనె పోసి వెలిగిస్తే, ఆ మట్టి ప్రమిదలకు ఉండే సూక్ష్మ రంధ్రాలు (Micro pores) నూనెనంతటినీ పీల్చేసుకుంటాయి. దీనివల్ల వత్తికి (Cotton Wick) సరిపడా నూనె అందక దీపం త్వరగా ఆరిపోతుంది. అదే ప్రమిదలను వెలిగించే ముందు కొన్ని గంటల పాటు నీటిలో నానబెడితే, ఆ రంధ్రాలన్నీ నీటితో నిండిపోతాయి. ఫలితంగా, మట్టి నూనెను పీల్చుకునే గుణం తగ్గిపోయి, ప్రమిదలో పోసిన నూనె పూర్తిగా వత్తికి అందుతుంది. దీనివల్ల నూనె వృథా కాకుండా (Oil Wastage Reduction) చాలా వరకు అడ్డుకోవచ్చు. కొత్త ప్రమిదలను ఎలా సిద్ధం చేయాలంటే, ముందుగా ఒక పెద్ద బకెట్ లేదా టబ్‌లో పరిశుభ్రమైన నీటిని నింపి, ప్రమిదలన్నీ మునిగేలా కొన్ని గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి, ఒక పొడి గుడ్డతో తుడిచి నీడలో బాగా గాలికి ఆరనివ్వాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్చాల్సిన విషయం ఏమిటంటే, ప్రమిద లోపల నీరు పూర్తిగా ఆరిపోయి ఉండాలి. లోపల తడి అలాగే ఉంటే నూనె లేదా నెయ్యి (Ghee) పోయడానికి కుదరదు కాబట్టి, పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోవాలి.
Also Read
- Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి - మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
- Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
- Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
- Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? పరిశోధనలో బయటపడ్డ నమ్మలేని నిజాలు
అయితే, ఇలా నీటిలో నానబెట్టడం వల్ల నూనె పీల్చుకోవడం తగ్గుతుందే కానీ, దీపాలు ఎంతసేపు వెలుగుతాయి (Burning Duration) అనేదానికి మాత్రం ఎలాంటి గ్యారెంటీ ఉండదు. దీపం ఎక్కువ సేపు వెలగడం అనేది మనం పోసే నూనె పరిమాణం, వత్తి సైజు (Wick Size) అది ఉన్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రమిదలను నీటిలో నానబెట్టినంత మాత్రాన రాత్రంతా దీపం వెలుగుతుందని కచ్చితంగా చెప్పలేం. ఈ దీపావళికి దీపాలు ఎక్కువ సేపు వెలగడానికి కొన్ని చిన్నచిన్న మెళకువలు పాటిస్తే సరిపోతుంది. ప్రమిద సైజును బట్టి సరైన వత్తిని ఎంచుకోవాలి. మరీ మందంగా ఉండే వత్తులు నూనెను త్వరగా పీల్చేసి అయిపోయేలా చేస్తాయి. వత్తి ఓ భాగం నూనెలో మునిగి, మరో భాగం బయటికి వెలిగించేలా ఉండాలి. అలాగే, గాలి ఎక్కువగా వీచే ప్రదేశాలలో దీపాలు పెట్టకూడదు, ఎందుకంటే గాలికి మంట ఊగిసలాడి వత్తి త్వరగా కాలిపోతుంది. నూనె ఒకవైపునకు ఒరిగిపోకుండా ప్రమిదలను ఎప్పుడూ చదునైన ప్రదేశంలోనే (Flat Surface) ఉంచాలి. అప్పుడే వత్తికి నిరంతరం నూనె అంది దీపాలు కాంతివంతంగా వెలుగుతాయి.
తాజావార్తలు
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Diwali Horoscope 2026: దీపావళి రోజు దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Japan Earthquake: జపాన్‌లో 5.7 తీవ్రతతో భారీ భూకంపం.. 22 మందికి గాయాలు
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు.. ఆసియా కప్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా?
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!