Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..

Diwali Clay

Diwali Clay

Diwali Tips: దివాళి పండుగ అనగానే మనందరికీ ముందుగా గుర్తువచ్చేది మట్టి ప్రమిదలతో (Clay Diyas) ఇళ్లు కళకళలాడటమే. ప్రతి ఒక్కరూ మార్కెట్ నుంచి కొత్త ప్రమిదలు తెచ్చి, ఇంటి గుమ్మంలో, పూజా గదిలో, బాల్కనీలో వెలిగిస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ప్రమిదల్లో పోసిన నూనె (Oil) క్షణాల్లో అయిపోతుంటుంది, దాంతో దీపాలు త్వరగా ఆరిపోతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే, దీపాలు వెలిగించే ముందు వాటిని కొద్దిసేపు నీటిలో నానబెట్టడం (Water Soaking) చాలా ముఖ్యం. ఇది నూనెను ఆదా చేసే ఒక చక్కటి పాతకాలపు ఇంటి చిట్కా (Desi Hack).

కొత్తగా మార్కెట్ నుంచి తెచ్చిన మట్టి ప్రమిదలను నేరుగా నూనె పోసి వెలిగిస్తే, ఆ మట్టి ప్రమిదలకు ఉండే సూక్ష్మ రంధ్రాలు (Micro pores) నూనెనంతటినీ పీల్చేసుకుంటాయి. దీనివల్ల వత్తికి (Cotton Wick) సరిపడా నూనె అందక దీపం త్వరగా ఆరిపోతుంది. అదే ప్రమిదలను వెలిగించే ముందు కొన్ని గంటల పాటు నీటిలో నానబెడితే, ఆ రంధ్రాలన్నీ నీటితో నిండిపోతాయి. ఫలితంగా, మట్టి నూనెను పీల్చుకునే గుణం తగ్గిపోయి, ప్రమిదలో పోసిన నూనె పూర్తిగా వత్తికి అందుతుంది. దీనివల్ల నూనె వృథా కాకుండా (Oil Wastage Reduction) చాలా వరకు అడ్డుకోవచ్చు. కొత్త ప్రమిదలను ఎలా సిద్ధం చేయాలంటే, ముందుగా ఒక పెద్ద బకెట్ లేదా టబ్‌లో పరిశుభ్రమైన నీటిని నింపి, ప్రమిదలన్నీ మునిగేలా కొన్ని గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి, ఒక పొడి గుడ్డతో తుడిచి నీడలో బాగా గాలికి ఆరనివ్వాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్చాల్సిన విషయం ఏమిటంటే, ప్రమిద లోపల నీరు పూర్తిగా ఆరిపోయి ఉండాలి. లోపల తడి అలాగే ఉంటే నూనె లేదా నెయ్యి (Ghee) పోయడానికి కుదరదు కాబట్టి, పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోవాలి.

అయితే, ఇలా నీటిలో నానబెట్టడం వల్ల నూనె పీల్చుకోవడం తగ్గుతుందే కానీ, దీపాలు ఎంతసేపు వెలుగుతాయి (Burning Duration) అనేదానికి మాత్రం ఎలాంటి గ్యారెంటీ ఉండదు. దీపం ఎక్కువ సేపు వెలగడం అనేది మనం పోసే నూనె పరిమాణం, వత్తి సైజు (Wick Size) అది ఉన్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రమిదలను నీటిలో నానబెట్టినంత మాత్రాన రాత్రంతా దీపం వెలుగుతుందని కచ్చితంగా చెప్పలేం. ఈ దీపావళికి దీపాలు ఎక్కువ సేపు వెలగడానికి కొన్ని చిన్నచిన్న మెళకువలు పాటిస్తే సరిపోతుంది. ప్రమిద సైజును బట్టి సరైన వత్తిని ఎంచుకోవాలి. మరీ మందంగా ఉండే వత్తులు నూనెను త్వరగా పీల్చేసి అయిపోయేలా చేస్తాయి. వత్తి ఓ భాగం నూనెలో మునిగి, మరో భాగం బయటికి వెలిగించేలా ఉండాలి. అలాగే, గాలి ఎక్కువగా వీచే ప్రదేశాలలో దీపాలు పెట్టకూడదు, ఎందుకంటే గాలికి మంట ఊగిసలాడి వత్తి త్వరగా కాలిపోతుంది. నూనె ఒకవైపునకు ఒరిగిపోకుండా ప్రమిదలను ఎప్పుడూ చదునైన ప్రదేశంలోనే (Flat Surface) ఉంచాలి. అప్పుడే వత్తికి నిరంతరం నూనె అంది దీపాలు కాంతివంతంగా వెలుగుతాయి.