Common Mistakes That Can Increase Cholesterol Levels: శరీరంలో కొలెస్టిరాల్ స్థాయి పెరిగితే, ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక సమస్యలు దరిచేరే అవకాశాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా.. చెడు కొలెస్టిరాల్ ఎక్కువగా ఉంటే మాత్రం ప్రమాదమే! గుండెపోటు, స్ట్రోక్, పెరిఫెరల్ వాస్కులర్ వంటి డేంజరస్ రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్ స్థాయిని పెరగకుండా, జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అయితే.. మనం సహజంగా చేసే తప్పుల కారణంగానే ఈ కొలెస్టిరాల్ స్థాయి శరీరంలో క్రమంగా పెరుగుతూ వస్తుంది. మరి, ఆ తప్పులేంటో తెలుసుకుందామా?
* శారీరక శ్రమ లేకపోవడం.. ఈరోజుల్లో చాలామంది సుఖానికి అలవాటు పడిపోయి, ఫిజికల్ టాస్కులు చేయలేకపోతున్నారు. ఈ కారణంగా, శరీరంలో ఉండే కొలెస్టిరాల్ క్రమంగా పెరుగుతుంది. కాబట్టి, ప్రతిరోజూ వీలైనంత సేపు వ్యాయామం చేస్తే బెటర్. ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల.. రక్తంలోని చెడు కొవ్వులు విసర్జించబడతాయి. వాకింగ్, జాగింగ్, యోగా, డ్యాన్స్ వంటివి రోజూ అరగంట చేస్తే.. కొవ్వు శాతం కరిగిపోతుంది.
* అనారోగ్యకరమైన ఆహారం.. ఫాస్ట్ ఫుడ్, సాసేజ్, కుకీలు, కేకులు, ఐస్ క్రీం, మైక్రోవేవ్ పాప్‌కార్న్ వంటి ఆహారాల్లో కొవ్వులు అధిక స్థాయిలో ఉంటాయి. వీటిని తింటే, శరీరంలో కొలెస్టిరాల్ స్థాయి అత్యధికంగా పెరుగుతుంది. అఫ్‌కోర్స్.. ఇవి రుచికరమైన ఫుడ్ ఐటమ్సే కానీ, వీటి వల్ల ప్రమాదమూ ఉంది. కాబట్టి, వీటిని సాధ్యమైనంతవరకు దూరంగా ఉంచడమే ఉత్తమం. వీటి స్థానంలో ఓట్స్, పండ్లు, బీన్స్, పప్పులు, కూరగాయలు వంటి ఆహారాలు తింటే ఉత్తమం.
* ధూమపానం & మద్యం సేవించడం.. స్మోకింగ్ అలవాటు వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంది. రక్తనాళాల గోడలను దెబ్బతింటాయి. ఈ కారణంగా.. మధుమేహం, అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయి. అలాగే.. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి.. ఈ రెండు అలవాట్లను మానుకుంటే చాలా మంచిది.
* శారీరక పరీక్షలు చేయించుకోకపోవడం.. మనకు రోగాలు రానంత మాత్రాన నిత్యం ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. శరీరంలో పెరిగే కొలెస్టిరాల్ స్థాయిల లక్షణాలు కనిపించవు. కాబట్టి.. సంవత్సరానికి ఒకసారి అయినా శరీర పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా పరీక్షలు చేయిస్తే, శరీరంలో శరీరంలో ఏదైనా సమస్య ఉంటే, దాన్ని గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా నివారించవచ్చు.
* వైద్యుల సలహాలు పాటించకపోవడం.. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అందుకు వైద్యులు సూచించిన మందులను తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలకు అంతరాయం కలిగిస్తుంది. మొత్తం ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపుతుంది.