Heart Attack Causes: ఈ రోజుల్లో యువతలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గతంలో పోల్చితే 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారు కూడా ఈ తీవ్రమైన సమస్య బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులు అని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం యువతలో చిన్నవయసులోనే గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Hyper Aadi : ఐ బొమ్మ కంటే అదే పెద్ద దరిద్రం.. హైపర్ ఆది కామెంట్స్
గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలు..
ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. ఎక్కువసేపు కూర్చోవడం, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌ల ముందు ఎక్కువ సమయం గడపడం, వ్యాయామం లేకపోవడం, పెరిగిన ఒత్తిడి యువతలో చిన్న వయసులోనే గుండెపోటుకు కారణం అవుతున్నాయని అన్నారు. వీటికి అదనంగా సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్ర లేకపోవడం కూడా గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెబుతున్నారు. ఇది కేవలం శారీరక బలహీనతకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, జీవనశైలి, మానసిక స్థితిపై కూడా విశేష ప్రభావం చూపుతుందని అన్నారు.
చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అతి పెద్ద కారణంగా క్రమం తప్పకుండా శారీరక శ్రమ లేకపోవడంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి అనారోగ్య సమస్యలు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఛాతీ ఒత్తిడి లేదా నొప్పి, శ్వాస ఆడకపోవడం, తీవ్ర అలసట, చెమట పట్టడం, కొన్నిసార్లు వికారం లేదా తలతిరగడం వంటి లక్షణాలు గుండెపోటుకు సంకేతాలు అని సూచిస్తున్నారు. ఈ లక్షణాలు సకాలంలో గుర్తించి, ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలని అంటున్నారు.
40 ఏళ్లలోపు గుండెపోటు రోగులలో 40% మందికి సాంప్రదాయ ప్రమాద కారకాలు లేవని డాక్టర్లు వివరిస్తున్నారు. శరీరం తగినంతగా చురుకుగా లేనప్పుడు, అది తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. మనం తీసుకునే ప్రతి శ్వాస మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని డాక్టర్లు అంటున్నారు. తగినంత నిద్ర, ఒత్తిడి నియంత్రణ, రోజువారీ వ్యాయామం ఈ సమస్యకు నిజమైన మందులుగా పేర్కొన్నారు. చాలా మందికి గుండె నివారణ చర్యల గురించి తెలుసు, కానీ కొద్దిమంది మాత్రమే వాటిని అమలు చేస్తారని అన్నారు. మధుమేహం గుండె జబ్బులను తీవ్రతరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలిలో మార్పులు చాలా అవసరం అని, చిన్న ఆరోగ్య అలవాట్లు గణనీయమైన రక్షణను అందిస్తాయని సూచించారు. ఈ గుండెపోటు సమస్యను యువత అధిగమించడానికి వారి దినచర్యలో క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, మానసిక ఒత్తిడి నియంత్రణను చేర్చుకుంటే గొప్ప ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు.
READ ALSO: China Japan War: యుద్ధం అంచున చైనా – జపాన్.. ఎవరి బలం ఎంతో చూడండి..!