Break Fast : బ్రేక్ ఫాస్ట్ గా వీటిని ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాత్రి డిన్నర్ కు ఉదయంకు చాలా సమయం ఉంటుంది.. అందుకే పొద్దున్నే అల్పాహారంను మిస్ చెయ్యొద్దని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.. ఉదయాన్నే మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే కొంత మంది లేవగానే ఏది పడితే అది తినడం.. తాగడం చేస్తూ ఉంటారు. దీని వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని ఆహార పదార్థాలను అసలు తినకూడదని చెబుతున్నారు.. వాటిని తీసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి చూద్దాం..
ఉదయం లేవగానే సిట్రస్ ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక స్థాయిలు అనేవి పెరుగుతాయి. కానీ ఉదయాన్నే పండ్లు కానీ జ్యూస్లు తాగితే అల్సర్, గుండెల్లో మంటలు, గ్యాస్, ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి…
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
ఉదయం స్పైసీ ఉన్న ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు. ఇలా అస్సలు తినకూడదట. దీని వల్ల ప్రేగులు లూజ్ అవుతాయి. జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతే కాకుండా స్పైసీ ఫుడ్ లో పోషకాలు తక్కువగా ఉంటాయి.. వాటివల్ల ఇంకా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది..
బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ అండ్ జామ్ ని తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా ఈజీగా, ఫాస్ట్ గా అయ్యే బ్రేక్ ఫాస్ట్. కాబట్టి దీన్ని తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఉదయాన్న బ్రెడ్, జామ్ ని తీసుకోవడం వల్ల మెదడు పని తీరు అనేది తగ్గుతుందట. ఏ పని మీద కూడా సరైన విధంగా ఏకాగ్రత కూడా పెట్టలేరు.. ఇంకా మానసికంగా చురుగ్గా ఉండలేరు.. అందుకే వీటిని తీసుకోవడం అసలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..
ఉదయం లేవగానే కొందరు ప్యాకేజ్డ్ జ్యూస్ లు తాగితే మాత్రం అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఎందుకంటే అవి నిల్వ ఉండటానికి రసాయనాలు కలుపుతారు. మార్నింగ్ వాటిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!