TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. ఇటీవల వరుసగా మూడు నోటిఫికేషన్లను విడుదల చేసిన కమిషన్, తాజాగా విద్యాశాఖలో కీలకమైన పోస్టుల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (Deputy Educational Officers) / గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01 జూలై 2026 నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్ఠంగా 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ముఖ్యమైన తేదీలు ఇవే..
ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 12 జూన్ 2026 కాగా.. దరఖాస్తులకు చివరి తేదీ: 19 జూలై 2026
Also Read
- SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
- RRB JE Recruitment 2026: రైల్వేలో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
అర్హులైన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.tgpsc.gov.in సందర్శించి ఆన్లైన్ ప్రొఫార్మా ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. విద్యార్హతలు, సిలబస్, పరీక్షా విధానం మరియు ఫీజు వివరాలతో కూడిన సమగ్రమైన నోటిఫికేషన్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంది.

ఇటీవలి కాలంలో టీజీపీఎస్సీ వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తుండటంతో నిరుద్యోగుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. చాలా కాలంగా విద్యాశాఖలో గెజిటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు. అభ్యర్థులు ఆలస్యం చేయకుండా నిబంధనలను పరిశీలించి, జూన్ 12 నుంచి జూలై 19 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
-
Chips Packet Empty: చిప్స్ ప్యాకెట్ సగం ఖాళీగా ఎందుకు ఉంటుంది..? 99 శాతం మందికి తెలియని నిజం ఇదే..
-
England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
-
PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్‌కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
-
Bhatti Vikramarka : సింగరేణి బ్లాకులు ప్రైవేట్ పరమైతే తీవ్ర ప్రమాదం
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!