వరల్డ్ వైడ్ గా ఐటీ జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. లక్షల్లో శాలరీలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు, వీకెండ్ హాలిడేస్, ఫారిన్ ట్రిప్స్ వంటి సౌకర్యాల కారణంగా ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువ. అందుకే యూత్ అంతా సాఫ్ట్ వేర్ జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. ఇటీవల దిగ్గజ ఐటీ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండడంతో బీటెక్ ఫ్రెషర్స్ ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ అందించింది. వందల్లో కాదు ఏకంగా వేలల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా 40 వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లను రిక్రూట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. 40 వేల ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. 40 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐటీ సెక్టార్ లో స్థిరపడాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ గా చెప్పొచ్చు. ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంపై సంస్థ కట్టుబడి ఉందని మిలింద్ లక్కడ్ తెలిపారు.
టీసీఎస్‌లో ఉద్యోగం పొందాలంటే కేవలం కోడింగ్ నైపుణ్యాలు మాత్రమే కాకుండా, తగిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలని మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులను E0 నుంచి E3 స్థాయిలలో రిక్రూట్ చేసుకోవడానికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తోంది. మరి మీరు ఏఐ స్కిల్స్ పై కూడా పట్టు కలిగి ఉంటే టీసీఎస్ లో జాబ్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు.