Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ దేశంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది. అక్కడ ‘హోమ్ బేస్డ్ కేర్ గివర్’ (Caregiver) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు జిల్లా ఉపాధి అధికారి ఎం. క్రిస్టీ అభినవ్ గురువారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) నేతృత్వంలో ఈ నియామక ప్రక్రియ సాగుతోంది.
ఈ ఉద్యోగాలకు 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న స్త్రీ, పురుషులు ఇరువురు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ (GDA, ANM, GNM, B.Sc Nursing) చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడటంలో కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ. 1,99,770 (దాదాపు 2 లక్షలు) వేతనం లభిస్తుంది. ప్రారంభంలో ఈ ఉద్యోగ ఒప్పందం రెండేళ్ల పాటు ఉంటుంది.
Also Read
దరఖాస్తు విధానం…
అభ్యర్థులు ఈ అంతర్జాతీయ అవకాశాన్ని అందుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 2.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు, తమ దరఖాస్తులను skillinternational@apssdc.in అనే ఈమెయిల్ ఐడికి పంపాల్సి ఉంటుంది.
విదేశాల్లో సేవలందించాలని భావించే నర్సింగ్ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప వేదిక. కేర్ గివర్‌గా ఇజ్రాయెల్‌లో మంచి జీవన ప్రమాణాలు, భారీ జీతం పొందే అవకాశం ఉండటంతో అర్హులైన వారు వెంటనే స్పందించాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలకు స్థానిక ఉపాధి కార్యాలయాన్ని లేదా APSSDC వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
తాజావార్తలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!