Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Low-Stress High-Paying Careers with Great Work-Life Balance in 2026: నేటి మారుతున్న జీవనశైలి, ఆఫీస్ కల్చర్ కారణంగా ఉద్యోగం అనేది కేవలం జీవనోపాధిగా కాకుండా ఓ పెద్ద మానసిక ఒత్తిడిగా మారిపోయింది. ఉదయాన్నే ఆఫీసుకు పరిగెత్తడం, రోజంతా బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్.. వీటన్నింటి మధ్య నలిగిపోయి ఇంటికి చేరేసరికి ఉద్యోగులు పూర్తిగా అలసిపోతున్నారు. అందుకే, ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో పని చేసే ప్రతి ఒక్కరూ మంచి జీతంతో పాటు, కుటుంబంతో గడపడానికి సమయం దొరికే వర్క్-లైఫ్ బ్యాలెన్స్’ ఉన్న ఉద్యోగాల కోసం కలలు కంటున్నారు. నేటి యువత కేవలం ప్యాకేజీలకే కాకుండా తమ మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటి నుంచే పని చేస్తూ, ప్రశాంతంగా మంచి సంపాదనను అందించే కొన్ని ఉత్తమ కెరీర్ ఆప్షన్లు ఇవే..
డేటా ప్రపంచం (Data Science)
మీకు సంఖ్యలు (Numbers), సమాచారాన్ని విశ్లేషించడంపై మంచి పట్టు ఉంటే, డేటా సైంటిస్ట్ లేదా బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ ఉద్యోగాలు అద్భుతమైన ఎంపికలు. ఇందులో కంపెనీల డేటాను విశ్లేషించి, భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ ప్రొఫైల్‌కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండటమే కాకుండా, కంపెనీలు భారీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తాయి. ప్రశాంతంగా కూర్చుని మెదడుకు పదును పెట్టే ఉద్యోగం ఇది.
Also Read
- Indian Navy SSC Officer Recruitment 2026: భారత నావికాదళంలో 275 SSC ఆఫీసర్ పోస్టులు.. అర్హత, ఎంపిక విధానం వివరాలు
- TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
- TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
- BOI Credit Officer Recruitment 2026: 779 పోస్టులకు దరఖాస్తుల ప్రారంభం.. అర్హత, జీతం, ఎంపిక విధానం పూర్తి వివరాలు
క్లైమేట్ టెక్ ఎక్స్పర్ట్ (Climate Tech Expert)
మారుతున్న జీవనశైలి ప్రభావం కేవలం మనుషులపైనే కాదు, ప్రకృతిపై కూడా పడుతోంది. ఈ నేపథ్యంలో క్లైమేట్ టెక్ ఎక్స్పర్ట్స్, సస్టైనబిలిటీ కన్సల్టెంట్స్ అవసరం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. పర్యావరణాన్ని రక్షించే సాంకేతికతలపై పరిశోధనలు చేయడం, ప్లానింగ్ చేయడం వీరి ముఖ్య విధి. ఇది పూర్తిగా రీసెర్చ్ ఆధారిత రంగం కావడం వల్ల రోజువారీ ఆఫీస్ టెన్షన్లు చాలా తక్కువగా ఉంటాయి.
టెక్నికల్ రైటింగ్ (Technical Writing)
మీరు క్రియేటివ్ ఫీల్డ్‌లో స్థిరపడాలని భావిస్తూ, సంక్లిష్టమైన సాంకేతిక విషయాలను సులభమైన భాషలో వివరించగల సామర్థ్యం మీకు ఉంటే.. టెక్నికల్ రైటింగ్ కెరీర్ మీకు పర్ఫెక్ట్. సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ప్రొడక్ట్స్, యాప్‌ల కోసం యూజర్ మాన్యువల్స్, గైడ్లను రాయించుకోవడానికి వీరిని నియమించుకుంటాయి. ఈ రంగంలో ఇతర ఉద్యోగాల తరహాలో నిరంతర డెడ్లైన్ల ఒత్తిడి ఉండదు, వర్క్ కల్చర్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది.
తాజావార్తలు
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!