కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ట్రై చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. మీకు సెంట్రల్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్ అయిపోతది. ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60% మార్కులతో కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ (MSc) లేదా తత్సమాన విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి.
Also Read:Vimal pan masala: విమల్ పాన్ మసాలా యాడ్.. షారూఖ్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు నోటీసులు..
SC, ST, PwBD అభ్యర్థులకు 55% మార్కులతో పాసైతే చాలు. ఇనార్గానిక్, ఆర్గానిక్, అనలిటికల్, ఫిజికల్, అప్లైడ్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. దరఖాస్తుదారులకు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ఫిబ్రవరి 28, 2025 నాటికి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపు వర్తిస్తుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read:Kishan Reddy: అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారు..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతం అందిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. SC/ST/PwBD/మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఎంపికైన అభ్యర్థులు IOCLలో కనీసం మూడు సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 21 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.