ఐటీ సెక్టార్ లో సెటిల్ అవ్వాలని చాలా మంది బీటెక్ చేస్తుంటారు. సాఫ్ట్ వేర్ జాబ్స్ కొడితే లక్షల్లో శాలరీలు అందుకుని లైఫ్ లో మంచి పొజిషన్ లో ఉండొచ్చని భావిస్తుంటారు. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. ప్రముఖ టెక్ కంపెనీలన్నీ లేఆఫ్స్ బాటపడుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఐటీ జాబ్స్ కంటే గవర్నమెంట్ సెక్టార్ లో జాబ్స్ కోసం ట్రై చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఐటీ జాబ్స్ ను తలదన్నే ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నాయి. మీరు బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నట్లైతే మీకు ఇదే గోల్డెన్ ఛాన్స్. ఇండియన్ ఆర్మీలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. అంతేకాదు రాత పరీక్ష లేకుండానే జాబ్ కొట్టొచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షల్లో జీతం అందుకోవచ్చు.
తాజాగా ఇండియన్ ఆర్మీ పురుషుల కోసం 65వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ రిక్రూట్‌మెంట్, మహిళలకు 36వ SSC (టెక్)ని ప్రకటించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 381 పోస్టులను భర్తీ చేయనున్నారు. పురుషులకు 350, మహిళలకు 29, ఆర్మీ విడోలకు 2 పోస్టులను కేటాయించారు. ఈ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/సివిల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి విషయానికి వస్తే.. SSC (టెక్)-65 పురుషులు, SSCW (టెక్)-36 మహిళలు, అభ్యర్థుల వయస్సు 1 అక్టోబర్ 2025 నాటికి 20 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
అవివాహిత పురుష మరియు స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు విద్యార్హత మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఐదు రోజుల SSB ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. ఇందులో సైకలాజికల్ టెస్టింగ్, గ్రూప్ వర్క్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఎంపికైన వారికి నెలకు 1.5 లక్షల వరకు వేతనం అందుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 05 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.