Sri Chaitanya: సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్‌తో శ్రీ చైతన్య మరో మైలురాయి..
- శ్రీచైతన్య విద్యాసంస్థల ల్యాండ్‌మార్క్ ఈవెంట్
- ప్రతిభతో అబ్బురపరిచిన చిన్నారులు
- 3 గంటల్లో 600 మ్యాథ్స్ ఫార్ములాలు ఏకకాలంలో పఠనం
- 100 రోజుల్లో విద్యార్థులను నిష్ణాతులుగా మార్చే శ్రీచైతన్య ప్రత్యేక శిక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో ప్రముఖ విద్యాసంస్థలుగా పేరు ప్రఖ్యాతి పొందిన శ్రీ చైతన్య విద్యాసంస్థలు మరో మైలురాయిని అధిగమించాయి. నవంబర్ 6న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో 20 రాష్ట్రాల నుండి పదివేల మంది శ్రీ చైతన్య విద్యార్థులు పాల్గొని 3 గంటల్లో 600 మ్యాథ్స్ ఫార్ములాలు ఏకకాలంలో పఠించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులు 310 సంవత్సరాల లోపు చిన్నారులే కావడం విశేషం. ఈ ఈవెంట్‌కు UKలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు ప్రత్యక్ష సాక్షిగా నిలిచి ప్రతిభ కనపరిచిన చిన్నారులకు అభినందనలు తెలియజేసి ప్రశంశా పత్రాలు అందజేశారు. శ్రీ చైతన్య విద్యాసంస్థకు సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ పథకాన్ని ప్రధానం చేశారు.
CM Revanth: యాదాద్రి కాదు యాదగిరిగుట్టే.. రికార్డులు మార్చండి
Also Read
- CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
- Onkar Batra: 7ఏళ్లకే వెబ్సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!
ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా తమ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సాధించిన సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ ఘనత విద్యారంగ చరిత్రలో అద్భుత ఘట్టమని చిన్నారుల ప్రతిభను కొనియాడారు. 2018లో 2.5-5 సంవత్సరాల వయస్సు గల 100 మంది విద్యార్థులు 100 దేశాల మ్యాప్‌లను పఠించి, భౌగోళిక అవగాహనలో సాధించిన అద్భుతమైన ఫీట్ గురించి.. 2022లో 601 మంది విద్యార్థులు 118 అంశాలను పఠించి, 10 రాష్ట్రాలలో పరమాణు చిహ్నాలతో కూడిన ఆవర్తన పట్టికను ప్రదర్శించిన విద్యార్థుల గురించి.. 2023లో 2,033 మంది విద్యార్థులు 100 నిమిషాల్లో 1 నుండి 100 వరకు గుణకార పట్టికలను పఠించిన నాటి ప్రపంచ రికార్డులను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇది కేవలం 100 రోజుల్లో తమ అధ్యాపకులు ఇచ్చిన అంకితభావంతో కూడిన శిక్షణకు నిదర్శనమని అన్నారు. ఈ ఏడాది సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ శ్రీ చైతన్య విద్యార్థులు సాధించినందుకు తాము గర్వపడుతున్నామన్నారు. ఇది మన విద్యా వ్యవస్థకు నూతన ఉత్సాహాన్ని, ప్రేరణను అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
Dil Raju : టాలీవుడ్ హీరోకి స్టేజిపైనే దిల్ రాజు షాకింగ్ కౌంటర్
39 సంవత్సరాలకు పైగా జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలలో విజయాలను సొంతం చేసుకోవడంలో శ్రీ చైతన్య స్కూల్ స్థాయి నుండే సమగ్ర శిక్షణ పద్ధతులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు.. ఆధునిక వనరులు విద్యా రంగంలో ఎన్నో మైలురాళ్లను అదిగమించేలా చేశాయని అన్నారు. అంతేకాకుండా ఒలింపియాడ్స్, IIT JEE & NEETలో అత్యుత్తమ శిక్షణ ఇస్తూ JEE మెయిన్, JEE అడ్వాన్స్డ్, NEET పరీక్షల్లో ఆల్ ఇండియా ర్యాంక్‌లను సాధించి తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొని జాతిగర్వించే విశ్వవిజేతలను అందిస్తోంది శ్రీ చైతన్య. ఈ సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ తమ విద్యా సంస్థ ప్రతిభ, కృషి గుర్తింపు అని.. ఈ సందర్భంగా తమ విద్యార్థులు సాధించిన విజయాలను గుర్తు చేస్తూ సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, ప్రపంచస్థాయి గుర్తింపునిచ్చిన UK వరల్డ్ ‘బుక్ ఆఫ్ రికార్డ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!