NTV Telugu Site icon

Zelensky: రష్యా నుంచి ఉక్రెయిన్ బందీల విడుదల.. జెలెన్‌ స్కీ ట్వీట్

Zelensky

Zelensky

Zelensky: గత ఏడాదిలో తమ దేశానికి చెందిన 1,358 మంది సైనికులు, పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్‌ స్కీ తెలిపారు. వారిని విడిపించడానికి ఉక్రెయిన్‌ అధికారులు చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. కొత్త సంవత్సరం 2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉందని తాజాగా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా అతడు పోస్టు పెట్టారు. రష్యా దగ్గర బందీలుగా ఉన్న తమ సైనికులు, పౌరుల విడుదలలో మిత్ర దేశాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం కూడా ఈ ఏడాదిలోనే ముగియాలని ఈ సందర్భంగా జెలెన్‌స్కీ కోరారు.

Read Also: Tirumala Darshanam: వేచివుండే అవసరం లేకుండానే శ్రీవారి దర్శనం

కాగా, 2022లో ఫిబ్రవరిలో రష్యా- ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన 30 వేల మందికి పైగా చనిపోయారు. ఉక్రెయిన్‌లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఇక, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు నిర్ణయం తీసుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చించి ఈ వార్ ను ముగిస్తారని నమ్ముతున్నానని జెలెన్ స్కీ చెప్పారు. మరోవైపు, పుతిన్ కు అనుకూలంగా ట్రంప్ వ్యవహరిస్తారని చాలా మంది అనుకుంటున్నారు.