Ukraine Peace Deal: డాన్బాస్ కావాలా.. NATO సభ్యత్వమా? ఉక్రెయిన్ ముందు అమెరికా ప్రతిపాదన!
- అబుదాబీ వేదికగా రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిచర్చలు.. డాన్బాస్ వదులుకుంటే, నాటో సభ్యత్వం ఇస్తామనే ప్రతిపాదన.. కీలక వ్యాఖ్యలు చేసిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine Peace Deal: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో కీలక ప్రతిపాదన వచ్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డాన్‌బాస్‌పై తమ అధికారాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు బలగాలను విత్ డ్రా చేసుకుంటే, ఉక్రెయిన్‌కు నాటో(NATO) సభ్యత్వం కల్పించే అవకాశంపై అమెరికా చర్చల్లో ప్రస్తావించినట్లు చెప్పారు. అబుదాబీ వేదికగా అమెరికా మధ్యవర్తిత్వంతో రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, పాశ్చాత్య దేశాల నుంచి భద్రతా హామీలపై స్పష్టమైన నిర్ణయం వచ్చిన తర్వాతే ఈ ప్రతిపాదనను ఉక్రెయిన్ ప్రజల ముందు ఉంచుతానని జెలెన్స్కీ చెప్పారు.
శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జెలెన్స్కీ.. ‘‘ఉక్రెయిన్ నాటోలో చేరితే, డాన్బాస్ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉంటుందా?’’ అని అమెరికా ప్రతినిధులు తనను అడిగినట్లు ఆయన చెప్పారు. ఇలాంటి ప్రతిపాదన రావడం ఇదే తొలిసారి అని ఆయన వెల్లడించారు. ఈ అంశంపై ఉక్రెయిన్ ప్రభుత్వం నాటో, యూరోపియన్ యూనియన్(ఈయూ)తో చర్చలు జరుపుతోందని తెలిపారు.
Also Read
- Microsoft Outage: 36 గంటల తర్వాత గాడినపడ్డ మైక్రోసాఫ్ట్ సేవలు.. గంటకు మిలియన్ల నష్టం!
- Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు!
- Trump Asia Tour: చైనాలో ఒకే వేదికపై ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్.. తొలిసారి చరిత్రాత్మక భేటీ!
- Qatar-Turkey Defence Agreement: గల్ఫ్‌లో ఉద్రిక్తతల వేళ.. ఖతార్, టర్కి సంచలన రక్షణ ఒప్పందం!
పాశ్చాత్య దేశాలు నిర్దిష్ట భద్రతా హామీలను ఖరారు చేసిన తర్వాతే ఈ ప్రతిపాదనపై ఉక్రెయిన్ ప్రజల అభిప్రాయాలు కోరుతామని చెప్పారు. ఈ ప్రతిపాదనను అంగీకరించాలా.? వద్దా? అనేది ఉక్రెయిన్ ప్రజల నిర్ణయాన్ని బట్టి ఉంటుందని, తానొక్కడినే నిర్ణయం తీసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి వస్తున్న సంకేతాలను కూడా పరిగణలోని తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
యూరప్ భద్రతపై పుతిన్ డిమాండ్..
యూరప్ భద్రతా వ్యవస్థలో మార్పలు తీసుకురావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో మళ్లీ శాంతి చర్చలు జరగాలంటే యూరప్ భద్రతా నిర్మాణంలో మార్పులు అవసరమని మాస్కో భావిస్తోంది. దీనిపై జెలెన్స్కీ స్పందిస్తూ.. యూరప్‌కు నిజమైన భద్రత కల్పించే వ్యవస్థలు ఈయూ, నాటోలు మాత్రమే అని చెప్పారు. యూరప్ భద్రతా వ్యవస్థను మార్చాలనుకునే రష్యా ప్రయత్నాలు మరిన్ని యుద్ధాలు, ఘర్షణలకు దారి తీస్తాయని హెచ్చరించారు.
ఉక్రెయిన్ భూభాగాలను కోరుతున్న రష్యా..
ఉక్రెయిన్ తూర్పు భాగంలో ఉన్న డోనెట్క్స్, లుహాన్స్క్, జపోరిజ్జియా, ఖేర్సన్ భూభాగాలను రస్యా తనలో కలుపుకున్నట్లు ప్రకటించింది. ఈ భూభాగాల నుంచి ఉక్రెయిన్ సైన్యం వెనక్కి వెళ్లాలని పుతిన్ కోరుతున్నాడు. ఆ ప్రాంతాలను రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకోకపోయినప్పటికీ, వాటిపై తన అధికారమే ఉందని రష్యా చెబుతోంది.
తాజావార్తలు
-
Ukraine Peace Deal: డాన్బాస్ కావాలా.. NATO సభ్యత్వమా? ఉక్రెయిన్ ముందు అమెరికా ప్రతిపాదన!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవానికి మోడీ శుభాకాంక్షలు.. 2023 జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ప్రధాని
-
Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
-
Microsoft Outage: 36 గంటల తర్వాత గాడినపడ్డ మైక్రోసాఫ్ట్ సేవలు.. గంటకు మిలియన్ల నష్టం!
-
NTRxAnilRavipudi: అసలు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ నవ్వుల జాతర!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!