Ukraine Russia War: జెలెన్‌స్కీ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకునేందుకు రష్యా భీకర దాడులు చేస్తోంది. ప్రధాన నగరాలపై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఏకధాటిగా బాంబులు, మిసైల్స్ తో నివాస భవనాలపై దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్ సైన్యం సైతం ఆ దాడులను సమర్థంగా ఎదుర్కొంటోంది. రష్యా విధ్వంసం సృష్టించడంతో మరియుపోల్ సిటీలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఎటు చూసినా శిథిల భవనాలు, వాటి నుంచి విడుదలవుతున్న పొగతో శ్మశాన వాతావరణం నెలకొంది. గత 20 రోజులుగా ఉక్రెయిన్‌పై దాడులు నిర్వహిస్తున్న రష్యా.. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా దాడులు ముమ్మరం చేసింది. ఉదయం స్వియాటోషిన్ స్కీ డిస్ట్రిక్‌లోని 16 ఫ్లోర్ల బిల్డింగ్‌పై జరిగిన దాడిలో ఇద్దరు చనిపోయారని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 27 మందిని రక్షించామన్నారు అధికారులు. దాడుల కారణంగా కీవ్ సమీపంలోని అంటోనోవ్ ఏవియేషన్ ఇండస్ట్రీ పార్క్ మంటల్లో చిక్కుకుంది.
Read Also: Covid 19: వ్యాక్సినేషన్‌లో మరింత స్పీడ్.. పిల్లలకు, పెద్దలకు..
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
కీవ్ సహా… కీలక నగరాలను స్వాధీనం చేసుకోవాలని యత్నిస్తున్న పుతిన్ సేనలను ఉక్రెయిన్ ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ పోరులో భారీ సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఇప్పటివరకు 13వేల 500 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ సైన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక.. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 596 మంది పౌరులు మరణించారని ప్రకటించింది. అయితే, ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. యుద్ధంతో లక్షలాది ప్రజలు తమ ఇళ్లను విడిచి పక్కదేశాలకు వలసపోతున్నారు. ఇప్పటివరకు 30లక్షల మంది ఉక్రెయిన్ సరిహద్దులు దాటి పొరుగుదేశాలకు వెళ్లిపోయారు. గత 20 రోజులుగా ఉక్రెయిన్‌లో సగటున ప్రతిరోజూ 70 వేల మందికి పైగా చిన్నారులు శరణార్థులుగా మారుతున్నారని యునిసెఫ్ తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకు దాదాపు 1.5 మిలియన్ల మంది చిన్నారులు దేశం విడిచి నుంచి బలవంతంగా తరలి వెళ్లారు. యుద్ధం ప్రారంభమైనప్పట్నుంచి ప్రతి నిమిషానికి దాదాపు 55 మంది పిల్లలు.. ప్రతి సెకనుకు దాదాపుగా ఒక పిల్లవాడు శరణార్థిగా మారుతున్నాడు.
అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మరో 30 రోజులపాటు మార్షల్ లా పొడగించేలా బిల్లు ప్రవేశపెట్టారు. రిజర్వ్ బలగాల కోసం 18 నుంచి 60 ఏళ్లలోపు ఆరోగ్యంగా ఉన్న పురుషులు ఉక్రెయిన్ వదిలి వెళ్లేందుకు అనుమతి లేదని ప్రకటించారు జెలెన్ స్కీ. రష్యా బలగాలు చుట్టుముట్టిన ప్రాంతాల నుంచి సామాన్య పౌరుల తరలింపునకు 9 మానవతా కారిడార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది ఉక్రెయిన్. మరియుపోల్ నగరానికి సహాయ సామగ్రి చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు…ఈయుద్ధం మరో 10 రోజుల్లో ముగింపునకు చేరే అవకాశముందని అమెరికా మాజీ కమాండర్ అంచనా వేశారు. వనరుల కొరతతో రష్యా సేనలు దాడులను విరమించుకునే పరిస్థితి రానుందని యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ యూరప్ మాజీ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బెన్ హోగ్స్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా యుద్ధం ఆపేందుకు నాటోతో కలిసేది లేదంటూ రష్యాతో కంప్రమైజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?