Muhammad Yunus: రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నాయకుడు, పచ్చి భారత వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసకు కారణమైంది. శనివారం హాది అంత్యక్రియలకు లక్షలాది జనం ఢాకాకు తరలివచ్చారు. బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే, హాది అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ కూడా హాజరయ్యారు. సంతాప సభలో ప్రసంగిస్తూ, హాదికి మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Bangladesh: ‘‘దైవ దూషణ’’ ఆధారాలు లేవు.. అయినా, హిందూ వ్యక్తిని దారుణం చంపారు..
తీవ్రవాద నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది ఆదర్శాలను అనుసరిస్తామని, పరోక్షంగా భారత వ్యతిరేఖ వైఖరిని అవలంభిస్తామని యూనస్ చెప్పకనే చెప్పాడు. సంతాప సభలో యూనస్ మాట్లాడుతూ.. ‘‘ ప్రియమైన ఉస్మాన్ హదీ, మేము మీకు వీడ్కోలు చెప్పడానికి ఇక్కడికి రాలేదు. మీరు మా హృదయాలలో ఉన్నారు, బంగ్లాదేశ్ ఉన్నంత కాలం, మీరు బంగ్లాదేశీయులందరి హృదయాలలో ఉంటారు. మిమ్మల్ని అక్కడి నుండి ఎవరూ తొలగించలేరు. ఈ రోజు లక్షలాది మంది ప్రజలు తరంగాల వలె గుమిగూడారు, బంగ్లాదేశ్ అంతటా కోట్లాది మంది ప్రజలు, విదేశాలలో నివసిస్తున్న బంగ్లాదేశీయులు హదీ గురించి వినడానికి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు’’ అని అన్నారు. ఈ సమావేశం వీడ్కోలు కాదని, ప్రతిజ్ఞ అని నొక్కి చెబుతూ.. ‘‘ మేము ప్రపంచం ముందు తలెత్తుకుని తిరుగుతాం. మేము ఎవరి ముందు తలవంచం’’ అని చెప్పారు.
ఇదే కాకుండా హాది కలను నెరవేరుస్తామని, దానిని బంగ్లా తర్వాతి తరాలు ముందుకు తీసుకెళ్తాయని యూనస్ అన్నారు. ఎన్నికల్లో పాల్గొనాలని మీరు కోరుకున్నారని, ఎన్నికల్లో ప్రచారాన్ని ఎలా నిర్వహించాలో మాకు చూపించారని, మీరు కనుమరుగై పోలేదని, బంగ్లాదేశ్ యుగయుగాలు మీతోనే ఉంటాయని అన్నారు. యూనస్, ఈ తీవ్రవాద నాయకుడి జీవితాన్ని తర్వాతి బంగ్లాదేశ్ తరాలకు తీసుకెళ్తామని చెప్పారు. బలమైన భారత వ్యతిరేకిగా ఉన్న హాది, భారత భూభాగాలతో ‘‘గ్రేటర్ బంగ్లాదేశ్’’ మ్యాప్‌ను ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత వ్యతిరేక వైఖరికి బంగ్లాదేశ్‌లో పేరు సంపాదించాడు. గతేడాది షేక్ హసీనా గద్దె దిగడంలో, హింసాత్మక ఆందోళలు చేయడంతో ఇతని పాత్ర ప్రధానంగా ఉంది.
