Muhammad Yunus: రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నాయకుడు, పచ్చి భారత వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసకు కారణమైంది. శనివారం హాది అంత్యక్రియలకు లక్షలాది జనం ఢాకాకు తరలివచ్చారు. బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే, హాది అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ కూడా హాజరయ్యారు. సంతాప సభలో ప్రసంగిస్తూ, హాదికి మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో రాడికల్ మతోన్మాద విద్యా్ర్థి నాయకుడు షరీప్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత హింస చెలరేగింది. డిసెంబర్ 12న ఢాకాలో అతడిని ఇద్దరు వ్యక్తులు అతి దగ్గర నుంచి కాల్చి, తీవ్రంగా గాయపరిచారు. డిసెంబర్ 19న హాది చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, ఇతడి మరణం తర్వాత బంగ్లాదేశ్ భగ్గుమంది. రాడికల్ శక్తులు మళ్లీ అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. మైమన్‌సింగ్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిని దైవదూషణ ఆరోపణతో హత్య చేశారు. Read Also:…
Bangladesh: భారత వ్యతిరేకి, ఇస్లామిస్ట్ రాడికల్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలకు కారణమైంది. శనివారం అతడి అంత్యక్రియలు ఢాకాలో జరిగాయి. దీనికి లక్షలాది మంది హాజరయ్యారు. అయితే, బంగ్లా జాతీయ కవి, విప్లవ కవిగా పేరున్న కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే హాది అంత్యక్రియలు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Bangladesh: పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’ భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో చనిపోయారు. హఠాత్తుగా ఒకరు, ఇద్దరు బైక్‌పై వస్తారు, తమ లక్ష్యంగా ఉన్న ఉగ్రవాది దగ్గరకు వచ్చి, గుండెల్లో బుల్లెట్లు దించి, క్షణాల్లో అక్కడ నుంచి పరారవుతుంటారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్క ‘‘గుర్తు తెలియని వ్యక్తి’’ని పట్టుకోలేకపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ దాడుల వెనక భారత గూఢచార సంస్థ ఉందని ఆరోపిస్తోంది.