Site icon NTV Telugu

Honour Killing: పాకిస్తాన్‌లో పరువు హత్య.. యువ జంటని కాల్చి చంపేశారు..

Honour Killing

Honour Killing

Honour Killing: ‘పరువు’ పేరుతో పాకిస్తాన్ దేశంలో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. మానవహక్కుల నివేదిక ప్రకారం, పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రతీ ఏడాది 1000 మంది మహిళలు దారుణంగా హత్యలకు గురవుతున్నారు. మరోసారి మరో పరువు హత్య పాకిస్తాన్‌లో చర్చనీయాంశం అయింది. జంటకు హాని కలిగించొద్దని న్యాయమూర్తి హెచ్చరించినప్పటికీ అమ్మాయి కుటుంబీకులు అబ్బాయిని, అమ్మాయిని చంపేశారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే ఈ హత్యలకు కారణమైంది.

Read Also: Diabetes: చక్కర మాత్రమే కాదు.. ఈ పదార్థం కూడా షుగర్‌ వ్యాధికి కారణమవుతోంది..

వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్‌కి 400 కిలోమీటర్ల దూరంలో ఖనేవాల్ జిల్లాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల నాసిర్ గిర్, 20 ఏళ్ల రామ్షాలు ఇరువురు ఇష్టపడి కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి అమ్మాయి రామ్షా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. బుధవారం రోజు నాసిర్ గిల్ ఇంట్లోకి చొరబడిని రామ్షా సోదరులు ఆదిల్ అఫ్జల్, జుబేర్ అఫ్జల్, మరో ఇద్దరితో కలిసి నాసిర్-రామ్షాలను కాల్చి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పెళ్లి తర్వాత తన తల్లిదండ్రులు గిల్‌ని అల్లుడిగా అంగీకరించేలా తాను ఒప్పిస్తాని రమ్షా చెప్పిందని పోలీస్ అధికారి అహ్మద్ తెలిపారు. వీరి రహస్య వివాహం తెలిసిన తర్వాత యువతి తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోనే నిర్బంధించారు. దీంతో గిల్ తన భార్య క్షేమం కోసం లాహోర్ హైకోర్టుని ఆశ్రయించాడు. రమ్షాని తన భర్త గిల్ తో వెళ్లాలని న్యాయమూర్తి ఆదేశించారు. వీరిద్దరు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారని, అతనితో కలిసి జీవించాలని అనుకుంటోందని, తల్లిదండ్రులు వీరిని వేధించవద్దని కోర్టు హెచ్చరించింది. అయినా కూడా రమ్షా సోదరులు యువజంటను హత్య చేశారు.

Exit mobile version