Electric Aircraft: వరల్డ్‌లో తొలి ఎలక్ట్రిక్ విమాన పరీక్ష విజయవంతం.. ఖర్చెంతో తెలుసా?
- వరల్డ్‌లో తొలి ఎలక్ట్రిక్ విమాన పరీక్ష విజయవంతం
- 27 నిమిషాల పాటు గాల్లో ప్రయాణం
- 27 నిమిషాలకు రూ.400-450 మధ్య ఖర్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్ట్రిక్ విమానయాన రంగంలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తిస్థాయి బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ విమానం విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. స్వీడన్‌కు చెందిన హార్ట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన 30 సీట్ల X1 విమానం బ్యాటరీ విద్యుత్‌తోనే 27 నిమిషాల పాటు గాల్లో ప్రయాణించింది.
న్యూయార్క్‌లోని ప్లాట్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నిర్వహించిన ఈ ప్రయోగాత్మక విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరు. కేవలం ఒక పైలట్ మాత్రమే విమానాన్ని నడిపారు. సుమారు 25,000 పౌండ్ల బరువు ఉన్న X1 విమానం 106 అడుగుల రెక్కల విస్తీర్ణం కలిగి ఉంది. బ్యాటరీ పవర్‌తోనే ప్రయాణించిన విమానం గరిష్ఠంగా 1,100 అడుగుల ఎత్తుకు చేరుకుంది. X1 విమానం పూర్తిగా బ్యాటరీ-ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థతో పనిచేస్తుందని హార్ట్ ఏరోస్పేస్ తెలిపింది. ఈ వ్యవస్థ 1 మెగావాట్‌కు పైగా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగలదని కంపెనీ వెల్లడించింది.
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
తొలి ప్రయాణంపై హార్ట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈఓ అండర్స్ ఫోర్స్‌లండ్ స్పందిస్తూ.. వాణిజ్య విమానాల స్థాయిలో ఎలక్ట్రిక్ విమాన ప్రయాణం సాధ్యమేనని X1 తొలి ఫ్లైట్ నిరూపించిందని అన్నారు. ఎలక్ట్రిక్ వాణిజ్య విమానాలు భవిష్యత్తులో విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాలను గణనీయంగా మార్చగలవని, తద్వారా ప్రయాణికులకు విమాన ప్రయాణ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
27 నిమిషాల ప్రయాణానికి ఖర్చు ఎంత?
X1 ప్రయోగాత్మక విమాన ప్రయాణంలో వినియోగించిన విద్యుత్‌కు అయిన ఖర్చు సుమారు 5 డాలర్లు మాత్రమేనని కంపెనీ తెలిపింది. అంటే 27 నిమిషాల ప్రయాణానికి విద్యుత్ బిల్లు భారత కరెన్సీలో సుమారు రూ.400-450 మధ్య ఉన్నట్లు అంచనా. అయితే ఇది కేవలం విమానం వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన ఖర్చు మాత్రమే. పైలట్ జీతం, నిర్వహణ, విమానాశ్రయ ఫీజులు, బ్యాటరీ క్షీణత, బీమా, ఆర్థిక వ్యయాలు వంటి ఇతర నిర్వహణ ఖర్చులు ఇందులో లేవు.
ప్యాసింజర్ విమానాలు ఎప్పుడంటే?
X1 ప్రయోగం చిన్న వాణిజ్య విమానం స్థాయిలో బ్యాటరీ-ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ పనిచేయగలదని నిరూపించినప్పటికీ.. ప్రస్తుతం కొన్ని సవాళ్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాటరీ బరువు, విమానం ప్రయాణించగల దూరం (రేంజ్) వంటి పరిమితుల కారణంగా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ విమానాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరల్లో పెరుగుతున్న అస్థిరత నేపథ్యంలో ఎలక్ట్రిక్ విమానాలపై ఆసక్తి పెరుగుతోంది. చమురు ధరలపై ఆధారపడకుండా తక్కువ నిర్వహణ వ్యయాలతో విమానాలను నడిపే అవకాశం ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ద్వారా లభించవచ్చని హార్ట్ ఏరోస్పేస్ పేర్కొంది.
The world’s largest electric aircraft took to the skies for the first time — the flight cost just $5
US company Heart Aerospace has flown its full-scale electric aircraft X1 for the first time — the largest all-electric aircraft ever to take flight.
The test flight lasted 27… pic.twitter.com/VnKcZZwyGR
— NEXTA (@nexta_tv) August 16, 2026
- Tags
- Electric aircraft
- world
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు