Iran: హిజాబ్ ధిక్కరిస్తే మహిళలకు ఉరిశిక్ష.. ఇరాన్‌లో కొత్త చట్టాలు..
- ఇరాన్‌లో కొత్త నైతిక చట్టాలు..
- మహిళల డ్రెస్సింగ్‌పై కఠిన ఆంక్షలు..
- హిజాబ్ ఉల్లంఘించిన, ధిక్కరించిన మరణశిక్షలతో పాటు కఠిన శిక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్‌లోని మత ప్రభుత్వం మహిళ హక్కుల్ని మరింతగా దిగజార్చే కొత్త చట్టాలను తీసుకువచ్చింది. మహిళలు హిజాబ్ వంటి నైతిక చట్టాలను కఠినంగా పాటించేందుకు ఈ చట్టాలను తీసుకువచ్చింది. ఒక వేళ వీటిని ధిక్కరిస్తే మరణశిక్ష లేదా 15 ఏళ్ల వరకు జైలుశిక్షతో సహా కఠినమైన శిక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. “పవిత్రత , హిజాబ్ సంస్కృతి”ని ప్రోత్సహించేందుకు ఈ చట్టాలను ఇరాన్ అధికారులు ఈ నెల ప్రారంభంలో ఆమోదించారు. ఈ చట్టాలు ‘‘నగ్నత్వం, అసభ్యతను వ్యతిరేకిస్తూ పూర్తిగా దుస్తులు ధరించడాన్ని ప్రోత్సహిస్తుంది’’. నేరస్తులకు భారీ నగదు జరిమానాలు, కొరడా దెబ్బలు, మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడితే 5 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ది గార్డియన్ ప్రకారం.. కొత్త నైతికత చట్టాలు ద్వారా ఎవరైనా సరైన డ్రెస్సింగ్‌ని ప్రోత్సహించేలా ప్రచారం చేసేలా విదేశీ సంస్థలు ఉదాహరణకు అంతర్జాతీయ మీడియా, ఇతర సమాజ సంస్థలకు తమ ఫోటోలు, సరైన డ్రెస్సింగ్ లేని వీడియోలను పంపించడం వంటివి చేస్తే 12,500 పౌండ్లు( రూ. 13.5 లక్షల) జరిమానా, కొరడా దెబ్బలు, మళ్లీ పునారావృతం అయితే, 5 నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కోవాలి. హిజాబ్ ఆదేశాలను పాటించపోవడం, నైతికత చట్టాలను ధిక్కరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఇరాన్ యొక్క ఇస్లామిక్ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 296 ప్రకారం, “భూమిపై అవినీతి”గా పరిగణించబడే వ్యక్తులకు మరణశిక్ష విధించబడుతుంది.
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
Read Also: Youtube Auto Dubbing Feature: అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చిన యూట్యూబ్.. ఇకపై ఏ భాషలోనైనా
అమ్నేస్టి ఇంటర్నేషనల్ ప్రకారం.. ఇరాన్ కొత్త మెరాలిటీ చట్టాలు మహిళలు, బాలికలు తమ వీడియోలను విదేశీ మీడియాకు బహిర్గతం చేసినా, శాంతియుత నిరసనలో పాల్గొన్నా వారికి మరణశిక్షలు విధించడాన్ని సమర్థింస్తుందని చెప్పింది. వీటిని ఖండిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు కొత్త చట్టంలోని ఆర్టికల్ 60 ప్రకారం.. ‘‘మతపరమైన విధి’’లో భాగంగా మహిళలు నిర్బంధంగా హిజాబ్ వేసేలా చేసిన వారికి రక్షణ లభిస్తుంది.
ఇరాన్ వ్యాప్తంగా అక్కడి కఠినమైన మత చట్టాలపై వ్యతిరేకత పెరుగుతోంది. అయితే, కఠినమైన శిక్షలకు భయపడి జనాలు భయపడిపోతున్నారు. రెండేళ్ల క్రితం మహ్సా అమిని అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళ హిజాబ్ సరిగా ధరించలేదని మోరాలిటీ పోలీసులు దాడి చేయడంతో ఆమె మరణించింది. ఈ మరణం తర్వాత ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది. అయితే, అక్కడి అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసింది. ఇందులో పాల్గొన్న కొందరికి మరణశిక్షలు అమలు చేసింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!