Colleague Hugging: కౌగిలించుకున్నాడంటూ కోర్టుకెక్కిన మహిళ.. భారీ జరిమానా విధించిన న్యాయమూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కౌగిలింత అనేది మనిషిలోనే టెన్షన్‌ను దూరం చేస్తుంది అంటారు.. ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా చెప్పుకునే కౌగిలింతతో.. అప్పటి వరకు ఉన్న బాధలు మరిచి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయంటారు.. లింగ బేధం లేకుండా సందర్భాన్ని బట్టి, అభినందించే సమయాన్ని బట్టి కూడా కౌగిలింతలు ఇస్తుంటారు.. అయితే, ఓ మహిళ.. కౌగిలింతపై కోర్టుకు వెళ్లడం.. కోర్టు భారీగా జరిమానా విధించడం ఆసక్తికరంగా మారింది.. కొలిగ్ తనను గట్టిగా కౌగిలించుకున్నాడని కోపగించుకున్న మహిళ.. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కారు.. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.
Read Also: Pawan Kalyan: పవన్‌ది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన..! లాజిక్ చెప్పిన మంత్రి..
Also Read
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
డ్రాగన్ కంట్రీలో 2021 సంవత్సరంలో మేలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని యుయాంగ్ నగరంలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ తన కార్యాలయంలో సహోద్యోగితో చాట్ చేస్తుండగా, ఒక మగ సహోద్యోగి ఆమె వద్దకు వచ్చి ఆమెను చాలా గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలింత నొప్పితో కేకలు వేసింది సదరు మహిళ… ఆమె ఛాతీలో అసౌకర్యాన్ని కలిగించింది.. ఉపశమనం కోసం.. తాత్కాలికంగా కొన్ని ఆయిల్ మసాజ్‌లు చేసినా ఉపయోగం లేకుండా పోయింది.. 5 రోజుల తర్వాత మహిళ ఛాతీలో నొప్పి మరింత తీవ్రమవ్వడంతో ఆస్పత్రికి వెళ్లింది. వైద్యుడు టెస్ట్‌లు చేయడంతో.. ఎక్స్‌రేలో మహిళకు మూడు పక్కటెముకలు విరిగినట్టు తేలింది. కుడి వైపున రెండు, ఎడమ వైపున ఒకటి విరిగిపోయాయని తేల్చారు..
అయితే, ఆ మహిళ ఉద్యోగానికి కూడా వెళ్లలేని పరిస్థితి.. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోగా.. భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది.. ఇక, తన పరిస్థితిని తనను కౌగిలించుకున్న వ్యక్తికి వివరించింది బాధితురాలు.. నీ కౌగిలింత వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చిందని విన్నవించింది.. కానీ, అతడు మాత్రం.. తన కౌగిలింతవల్లే ఇంత జరిగిందా? దానికి రుజువు ఏంటి? అని రివర్స్ ఎటాక్‌కు దిగాడు.. ఇక, చేసేది ఏమీ లేక.. తన సహోద్యోగిపై కోర్టులో దావా వేసింది బాధిత మహిళ.. తన ఆర్థిక నష్టాలకు పరిహారం కోరింది. ఈ కేసును విచారించిన కోర్టు.. 10,000 యువాన్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 1.16 లక్షలు పరిహారంగా చెల్లించాలని న్యాయమూర్తి సహోద్యోగిని ఆదేశించారు.. ఇక, ఆ ఐదు రోజుల్లో ఎముకలు విరగడానికి కారణమయ్యే కార్యకలాపాల్లో మహిళ పాల్గొన్నట్టు రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. కౌగిలించుకోవాలి.. దాంట్లో ప్రేమ, ఆప్యాయత ఉండాలి.. కానీ, ఇంత మొరటుగా ఏందిరా అయ్యా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. మొత్తంగా కౌగిలింత.. కోర్టు ఫైన్ వ్యవహారంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!