తానే తప్పూ చేయలేదు… మూడేళ్లు మెడిసిన్ పూర్తి చేసిన ఆమె… కొవిడ్ తరువాత..చివరి సంవత్సరం చదువుకునేందుకు ఫిలిప్పీన్స్ వెళ్ళింది..ఫ్లైట్ దిగగానే.. అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారుల మాటలు విన్న ఆమె.. కుప్పకూలిపోయింది. ఏం చేయాలో అర్థం కాని.. ఆ యువతి ..నెక్స్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్ వచ్చేసింది.
ఫిలిప్పీన్స్ మనీలాలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్ళు నవ్య దీప్తి , భవ్య కీర్తి మెడిసిన్ మూడేళ్లు పూర్తి చేశారు. కోవిడ్ కారణంగా రెండేళ్లు ఆన్లైన్ లోనే పూర్తి చేశారు..తిరిగి నాలుగో అవతారం చదివేందుకు ఫిలిప్పీన్స్ వెళ్దాము అనుకుంటుండగానే.. భవ్య కీర్తి కి యాక్సిడెంట్ అయింది..దీంతో సోదరి నవ్య దీప్తి ఒక్కతే ఫిలిప్పీన్స్ కు వెళ్ళింది. హైదరాబాద్ నుండి ఫిలిప్పీన్స్ విమానాశ్రయం చేరుకున్న ఆమెకు ..అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు పెద్ద షాకే ఇచ్చారు.
నీది,మీ సోదరి ఇద్దరి పాస్ పోర్ట్ లు బ్లాక్ అయ్యాయి..వెంటనే ఇండియా కు వెళ్లిపోవాలని హెచ్చరించారు. మేము ఏ నేరం చేశారని మీరు పాస్ పోర్ట్ బ్లాక్ చేశారంటూ వారిని నిలదీసింది. దీంతో రికార్డ్ లు పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు…మీ ఇంటి యజమాని మీపై కేసు దాఖలు చేసిందని చెప్పటంతో నవ్య ఒక్కసారిగా ఆందోళనకు గురయింది. వెంటనే ..ఫిలిప్పీన్స్ లోని తన పాత ఇంటి యజమానితో మాట్లాడే ప్రయత్నం చేసింది..అయినా ఆమె అందుబాటులోకి రాలేదు..దీంతో.. అధికారులు నవ్యకు రిటర్న్ టికెట్ బుక్ చేయించి ..ఎయిర్ పోర్ట్ నుండే..హైదరాబాద్ కు పంపించేశారు.
Komatireddy Venakat Reddy : వెధవ పనులు చేస్తున్నారు.. సోనియా, రాహుల్ దగ్గర తేల్చుకుంటా..
తిరుగు ప్రయాణంలో..అసలు పాత ఇంటి యజమాని తో ఇష్యూస్ లేవు కదా..ఏం జరిగిందా అని ఆలోచిస్తుంటే…నిన్ను మళ్ళీ ఫిలిప్పీన్స్ లో అడుగు పెట్టనీయను అన్న ఇంటి ఓనర్ మాటలు గుర్తుకు వచ్చాయి. ఇల్లు ఖాళీ చేసే సమయంలో క్లీనింగ్ సరిగ్గా చేయలేదు అని యజమాని చెపితే..హైదరాబాద్ నుండి ఆమె అకౌంట్ కి 45 వేల రూపాయలు పంపించారు..అయినా..మనసులో కోపం పెట్టుకున్న ఆ ఇంటి యజమానురాలు…తన పలుకుబడితో..ఇద్దరు అక్కా చెల్లెళ్ళ పాస్ పోర్ట్ బ్లాక్ చేయించింది. ఇంత చిన్న వ్యక్తిగత ఇష్యూకి ఇంత పెద్ద శిక్ష ఏంటి అని ఫిలిప్పీన్స్ అధికారులను ఆరా తీయగా…నవ్య,భవ్య ల ఇంటి యజమానురాలు ఫిలిప్పీన్స్ లోని ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ లో అధికారి అని తేలింది.
వ్యక్తి గత కక్షతో..తన అధికారాన్ని దుర్వినియోగ పరిచిన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నవ్య, భవ్య కుటుంబసభ్యులు సిద్ధం అయ్యారు. ఎంబసీ అధికారులు జోక్యం చేసుకుని తమను ఎలాగైనా ఫిలిప్పీన్స్ పంపించాలని నవ్య దీప్తి వేడుకుంటోంది. ఎంతో ఖర్చు చేసి ఇద్దరు కూతుర్లను మెడిసిన్ చదివిస్తున్న తండ్రి సూర్యనారాయణ…తమకు న్యాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.ఫిలిప్పీన్స్ లోని యూనివర్సిటీ లీగల్ టీమ్ సైతం నవ్య, భవ్య లకు మద్దతుగా నిలిచారు..న్యాయ పరంగా పాస్ పోర్ట్ అన్ బ్లాక్ చేయిస్తామని వారు హామీ ఇచ్చారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి.. ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళకు న్యాయం చేయాలని ఆశిద్దాం.