కోవిడ్ చికిత్స.. మరో 2 ఔషధాలకు డబ్ల్యూహెచ్‌వో గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది.. దానికి చెక్ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ఇదే సమయంలో మరికొన్ని ఔషధాలకు కూడా ఆమోదం తెలింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)… కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి తాజాగా మరో రెండు ఔషధాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రుమటైడ్ కీళ్ల నొప్పుల నివారణకు ఎలి లిల్లీ కంపెనీ తయారు చేసిన మెడిసిన్, గ్లాక్సోస్మిత్‌క్లేన్ కంపెనీ మోనో క్లోనల్ యాంటీబాడీ థెరపీలను కోవిడ్ రోగులకు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్‌వో నిపుణులు ఆమోదం తెలిపారు.. కోవిడ్ రోగులకు చికిత్సలో ఇవి కీలకంగా పనిచేస్తాయని ఇప్పటికే జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి..
Read Also: జనవరి 15, శనివారం దినఫలాలు…
Also Read
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఆమోదం తెలిపిన లిల్లీ కంపెనీకి చెందిన బారిక్టినిబ్ ఔషధం కరోనా తీవ్రంగా సోకినవారి ప్రాణాలు కాపాడుతుందని పేర్కొంది.. అంతే కాదు.. బాధితులకు వెంటిలేటర్ అవసరం లేకుండా చేస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది డబ్ల్యూహెచ్‌వో.. స్టెరాయిడ్స్‌తో పాటు కీళ్ల నొప్పులకు వాడే ఈ ఔషధాన్ని ఇస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని స్పష్టం చేసింది.. ఇప్పటికే ఈ ఔషధాన్ని యూఎస్, యూరప్‌లలో 2021 మే నెల నుంచి అత్యవసర సమయాల్లో వినియోగిస్తున్నారని.. కోవిడ్‌తో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరే అవసరం ఉన్న వారికి గ్లాక్సో కంపెనీకి చెందిన మోనోకల్నల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ ఇవ్వొచ్చని పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరోవైపు, డబ్ల్యూహెచ్‌వో ఆమోదం లభించకుండానే.. మరికొన్ని దేశాల్లో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు, వివిధ ఔషధాలను కూడా వినియోగిస్తున్నారు.
తాజావార్తలు
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!