చైనా వేదికగా షాంఘై సహకార సదస్సులో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిసి తిరిగారు. అంతేకాకుండా చాలా కులాసాగా మాట్లాడుకున్నారు. నవ్వుతూ.. ఉల్లాసంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు ప్రపంచానికి ఒక హెచ్చరికగా వెళ్లాయి.
ఇది కూడా చదవండి: Kim Jong: చైనాలోకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన ఉత్తర కొరియా నేత కిమ్
తాజాగా ఇదే అంశంపై ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో స్పందిస్తూ.. భారత్‌పై విమర్శలు గుప్పించారు. మోడీ.. రష్యాతో కాకుండా అమెరికాతో కలిసుండాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద నియంతృత్వ నాయకులు పుతిన్, జిన్‌పింగ్‌లని.. అలాంటి వారితో మోడీ కలిసుండడం సిగ్గుచేటు అన్నారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. అలాంటి దేశం నియంతృత్వ నియంతలతో కలిసుండడమేంటి? వారితో మోడీ కలిసి తిరిగడం సిగ్గుచేటు కాదా? అన్నారు. ఈ స్నేహానికి అర్థం లేదని వ్యాఖ్యానించారు. మోడీ ఏమి ఆలోచిస్తున్నారో తనకు తెలియదని.. రష్యాతో కాకుండా యూరప్, ఉక్రెయిన్‌తో కలిసుండాలని భావిస్తారని ఆశిస్తున్నట్లు నవారో తెలిపారు.
ఇది కూడా చదవండి: Delhi Floods: యమునా నది ఉధృతం.. ఇళ్లల్లోకి వచ్చేసిన నీరు.. స్కూళ్లు, ఆఫీసులు మూసివేత
భారత్‌పై తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి రష్యా, చైనాతో భారత్ సంబంధాలు పెంచుకుంటోంది. ఇక చైనా వేదికగా జరిగిన ఎస్‌సీవో సమావేశంలో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ నవ్వుకుంటూ కనిపించారు. ఈ దృశ్యాలు చాలా హైలెట్‌గా నిలిచాయి.
