హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్ ప్రజలను నివాసాలను ఖాళీ చేయాలని ఐడీఎఫ్ దళాలు హెచ్చరించాయి.
గతేడాది అక్టోబర్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే హమాస్ లక్ష్యంగా గాజాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. తాజాగా హిజ్బుల్లా లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు వార్ కొనసాగిస్తున్నాయి. హమాస్ సొరంగాలు నాశనం చేసిన ఇజ్రాయెల్ సైన్యం.. అంతకంటే పెద్దవైన హిజ్బుల్లా సొరంగాలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ దళాలు విడుదల చేశాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు బంకర్ బస్టర్ గురించే చర్చ జరుగుతోంది. అత్యంత రహ్యస ప్రాంతంలో దాగి ఉన్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను బంకర్ బస్టర్ అంతమొందించింది. భూగర్భంలో దాదాపు 60 అడుగుల లోతులో అండర్‌గ్రౌండ్‌లో భద్రతా బలగాల కాపుదలలో ఉన్న నస్రల్లాను లేపేసింది. ఇప్పుడే ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.