NTV Telugu Site icon

US Visit : ప్రధాని మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నాం.. యూఎస్ కాంగ్రెస్ సభ్యులు

Us Visit

Us Visit

US Visit : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కోసం తాము వేయి కళ్లతో ఎదురు చూస్తు్న్నట్టు అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రధాని మోడీ అమెరికా పర్యటన చేయనున్న నేపథ్యంలో .. మోడీ పర్యటన కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నట్టు అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు వీడియోలు విడుదల చేశారు. నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు అమెరికన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూఎస్ పర్యటన సందర్భంగా జూన్ 22న ప్రతినిధుల సభ, సెనేట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం యూఎస్ కాంగ్రెస్ ఇటీవల ప్రధాని మోదీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో రెండోసారి ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని ప్రధాని మోడినే.

Read also: AAA Cinemas: సొంత మల్టీప్లెక్స్ లాంఛ్ చేసిన బన్నీ

ప్రధాని మోదీ చేసే ప్రసంగం కోసం తాము ఎదురుచూస్తున్నామని పలువురు అమెరికా కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. భారత ప్రధాని అమెరికా పర్యటన ప్రాముఖ్యత గురించి కూడా వారు మాట్లాడారు. భారత ప్రధానమంత్రి మోదీ ఇక్కడికి రావడం, ఆయన పర్యటనలో చేయనున్న సంభాషణలు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నానని యూఎస్ ప్రతినిధుల సభ సభ్యులు రిచర్డ్ మెక్‌కార్మిక్ తెలిపారు. భారతదేశం ప్రాముఖ్యత గురించి ఆలోచించని వారు ఎవరుండరని అన్నారు. డబ్ల్యూటీవో నిబంధనలను ఉల్లంఘించకుండా వాటిని అనుసరిస్తున్న దేశం ఇండియానని.. తమకు అలాంటి భాగస్వామి కావాలన్నారు.

Read also: T Series: టాలీవుడ్ పై కన్నేసిన టీ సిరీస్.. హైదరాబాద్ లో పాగా!

వచ్చే వారం యూఎస్‌ దేశ రాజధానికి భారత ప్రధాని మోదీని స్వాగతించడానికి తాను సంతోషిస్తున్నట్టు యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధి బడ్డీ కార్టర్ తెలిపారు. అమెరికా-భారత్ బంధం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనదని ఆయన అన్నారు. అమెరికా కాంగ్రెస్‌లో ఇండియా ప్రైమ్‌ మినిస్టర్‌ మోడీ చేసే ప్రసంగం కోసం కాంగ్రెస్ ఎదురుచూస్తోందని అమెరికా కాంగ్రెస్‌లో మహిళా సభ్యురాలు షీలా జాక్సన్ లీ అన్నారు. కాంగ్రెస్ ఉభయ సభలు కూడా ఎదురుచూస్తున్నాయని.. తాము కలిసి చేసే అన్ని పరిష్కారాల కోసం ఎదురుచూస్తామని చెప్పారు.