NTV Telugu Site icon

Jupiter: గురుగ్రహంపై భారీ ఫ్లాష్ లైట్.. ఏమై ఉంటుంది..?

Jupiter

Jupiter

Jupiter: సౌరకుటుంబంలో అతిపెద్ద గ్రహం, భారీ వాయుగోళం గురుగ్రహంపై మరోసారి ఫ్లాష్ లైట్ కనిపించింది.  ఎప్పుడు చూడని విధంగా ఈ ఫ్లాష్ ఉంది. ఇలాగే గతంలో అంతరిక్ష వస్తువులు గురుగ్రహంలో కూలిపోవడంతో భారీ వెలుగులు కనిపించాయి. తాజా నమోదైన ఈ వెలుగు, ఇది వరకు ఎప్పుడూ చూడని విధంగా ఉందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. ఆగస్టు 28న ఇది రికార్డ్ అయింది.

Read Also: Scrub Typhus: ఒడిశాను వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. కొత్తగా 11 కేసులు

గురుగ్రహానికి దగ్గరగా ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. దీని నుంచి తప్పుకునే గ్రహశకలాలు లేదా తోకచుక్కలు గురుగ్రహ గురుత్వాకర్షణకు ప్రభావితమై ఆ గ్రహాన్ని ఢీకొడుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే భారీ వెలుగు కనిపిస్తుంటుంది. ఈ మెరుపు గురించి క్యుటో విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్త అరిమాట్సు మాట్లాడుతూ..బృహస్పతి గురుత్వాకర్షణ శక్తికి గురైన ఓ వస్తువు గ్రహ వాతావరణంలో పడిపోయిందని చెప్పారు. మన సౌరవ్యవస్థ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ ఫ్లాష్ లు కీలకమైన మార్గమని డాక్టర్ అరిమాట్సు వివరించారు.

1994లో షూమేకర్ లేవీ 9 అనే తోకచుక్క ఇలాగే బృ‌హస్పతిని ఢీకొట్టింది. ఈ తాకిడి వల్ల గురుడి ఉపరితలంపై పెద్ద వెలుగు కనిపించింది. దీన్ని హబుల్ టెలిస్కోప్ చిత్రీకరించింది. గురు గ్రహం భూమితో పాటు అంతర సౌరకుటుంబంలోని గ్రహాలను కాపాడుతుంది. ఒక వేళ గురుగ్రహమే లేకుంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోని గ్రహశకలాలు దారి తప్పి భూమి వైపు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండేది. 2010 నుంచి గురుగ్రహంపై 9 మెరుపులలో 8 కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు.