NTV Telugu Site icon

Putin: మరోసారి తండ్రి కాబోతున్న రష్యా అధ్యక్షుడు.. 30 ఏళ్లు చిన్నదైన ప్రేయసితో..

Alina Putin

Alina Putin

ప్రపంచ అగ్రనేతల్లో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. 69 ఏళ్ల పుతిన్ తన కన్న 30 ఏళ్లు చిన్నదైన అలీనా కుబేవా(39)తో రహస్య సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరికి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే మరోసారి అలీనా కుబేవా గర్భంతో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పుతిన్ కు అమ్మాయి జన్మిస్తుందని తెలుస్తోంది. అయితే కుబేవా గురించి రహస్యాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. కుబేవాకు 2015లో స్విట్జర్లాండ్ లో ఓ కుమారుడు జన్మించాడని.. ఆ తరువాత 2019లో మాస్కోలో మరో కుమారుడికి జన్మనిచ్చినట్లు సమాచారం.

ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత జిమ్నాస్ట్ అయిన అలీనా కుబేవా, పుతిన్ ల బంధం చాలా రహస్యంగా ఉంది. వీరి గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉంటాయి. అలీనా రష్యాలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. ఈమె ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా గ్రూప్ కు బాస్ అని కూడా సమాచారం. అలీనా కుబేవా ఒలింపిక్స్ లో రెండు పథకాలను గెలుచుకుంది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో స్వర్ణం గెలుచుకోగా.. 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకుంది. ఇప్పటి జిమ్నాస్టిక్స్ లో 14 ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాలు ఉన్నాయి. ఒలింపిక్స్ సమయంలోనే అలీనా, రష్యా అధినేత పుతిన్ మనసును గెలుచుకుందని చెబుతుంటారు. ఆ తరువాత నుంచే వీరిద్దరి బంధం బలపడిందని కథలుగా చెప్పుకుంటారు.

Read Also:Vijayendra prasad: ‘రజాకార్ ఫైల్స్’ మూవీ రావడం ఖాయమా?

పుతిన్ మొదటి బార్య లియుడ్మిలా. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 37 ఏళ్ల మారియా ఫాసెస్ సైంటిస్ట్. ఈమె డచ్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. రెండో కుమార్తె 35 ఏళ్ల కాటెరినా టిఖోనోవా. ఈమె మాస్కో స్టేట్​ యూనివర్సిటీలోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మేథమెటికల్​ రీసెర్చ్​ ఆఫ్​ కాంప్లెక్స్​ సిస్టమ్స్​ డైరెక్టర్​. రాక్​ అండ్​ రోల్​ డ్యాన్సర్​గాను టిఖోనోవా ప్రసిద్ధి చెందింది. ఇదే కాకుండా పుతిన్ కు రష్యా మల్టీ మిలియనీర్ సెత్లానా క్రివోనోగిక్​తో కూడా వివాహేతర సంబంధం ఉన్నట్లు వార్తలు ఉన్నాయి. వీరిద్దరికి ఓ కుమార్తె కూడా ఉందని తెలుస్తోంది.