Vladimir Putin: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఎలాంటి ముందస్తు కండిషన్స్ కూడా పెట్టబోమన్నారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాత్రం మాట్లాడే ప్రసక్తి లేదని ఆయన క్లారిటీగా చెప్పారు. ఆ దేశ పార్లమెంటుతోనే చర్చలు జరుపుతాం.. ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు కూడా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి.. జెలెన్‌స్కీని తాము చట్టబద్ధమైన ప్రెసిడెంట్ గా చూడటం లేదని పుతిన్ పేర్కొన్నారు.
Read Also: AP Cabinet: 21 అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయం
అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధంలో తాము విజయం సాధించేందుకు చేరువలో ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. తమ దళాలు రోజుకొక చదరపు కిలో మీటర్ కీవ్ భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నాయని వెల్లడించారు. తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ సక్సెస్ అవుతుందని అన్నారు. అలాగే, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో గత నాలుగేళ్ల నుంచి మాట్లాడలేదు.. అయితే ఆయన్ను కలిసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు.