Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
- వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం
- 19 మంది తెలుగు పర్యాటకులు మృతి
- పలువురి పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వియత్నాంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న బోటు ఒక్కసారిగా తీవ్రమైన అలలకు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 19 మంది తెలుగు పర్యాటకులు జలసమాధి అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయ బృందాలు రక్షణ చర్యలు చేపట్టారు. స్థానిక అధికారులతో కలిసి నేవీ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 11: 30 గంటలకు బోటు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ మొబైల్ కంపెనీ తరపున డీలర్స్ టూరిస్ట్‌లుగా వెళ్లారు. ఏపీ నుంచి 30, తెలంగాణ నుంచి 45 మంది వెళ్లారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ కూడా లైఫ్ జాకెట్లు వేసుకోలేదని ప్రత్యక్ష సాక్షి శ్రీనివాస్ ఎన్టీవీకి తెలిపాడు.
ఇక మృతుల వివరాల కోసం అధికారులు హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలు కంట్రోల్ రూమ్‌లను సంప్రదించవచ్చు: +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414. హనోయిలోని రెండవ కంట్రోల్ రూమ్‌ను +84 91 308 9165 నంబర్‌తో సంప్రదించవచ్చు. ఎలాంటి సహాయానికైనా, సందేహాలకైనా తాము అందుబాటులో ఉన్నామని భారత మిషన్ తెలిపింది.
Also Read
- Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
మొత్తం బోటులో 75 మంది భారతీయులు ఉండగా.. ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు, తమిళనాడు వాసులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే వారి పూర్తి వివరాలు, స్వస్థలాలు, కుటుంబ సభ్యుల సమాచారం సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాయబార కార్యాలయం కూడా వియత్నాం అధికారులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. బోటు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులా, సాంకేతిక లోపమా, లేక మరే ఇతర కారణమా అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.
ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోని బంధువులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
In a tragic incident, a boat carrying several Indian tourists has capsized near Phu Quoc Island in Vietnam a few hours ago.
Exact details of the incident are being ascertained as search and rescue operations by local authorities are ongoing.
In order to provide information…
— India in Vietnam (@AmbHanoi) July 11, 2026
#WATCH | Rescue operations underway near Phu Quoc Island in Vietnam where a boat carrying Indian tourists capsized, a few hours ago.
(Source: Voice of Vietnam) pic.twitter.com/mcY7HHsvBk
— ANI (@ANI) July 11, 2026
తాజావార్తలు
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
ట్రెండింగ్
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!