China: స్పేస్ వార్‌కు చైనా సై.. ఉపగ్రహాలను సైతం బూడిద చేసే ‘సరికొత్త ఆయుధం’ సిద్ధం! ఎలా పని చేస్తుందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: అంతరిక్షంలో అగ్రరాజ్యం అమెరికాకు గట్టి పోటీ ఇస్తున్న చైనా, తాజాగా ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా ఒక సంచలన ఆయుధాన్ని ఆవిష్కరించింది. భవిష్యత్తులో జరగబోయే అంతరిక్ష ఆధారిత (Space-based) యుద్ధాల స్వరూపాన్ని మార్చేసే అత్యంత శక్తివంతమైన సరికొత్త ‘హై-పవర్ మైక్రోవేవ్’ (HPM) ఆయుధాన్ని చైనా రక్షణ శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఈ వినాశకర ఆయుధం ఏకంగా 100 గిగావాట్ల (GW) వరకు మైక్రోవేవ్ శక్తిని ఉత్పత్తి చేయగలదని నిపుణులు వెల్లడించారు. చైనాలోని ప్రఖ్యాత ‘నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ’ (NUDT) శాస్త్రవేత్తలు విడుదల చేసిన ఒక పరిశోధనా పత్రంలో ఈ మైండ్ బ్లాగింగ్ వివరాలు వెల్లడయ్యాయి. చైనా సైన్యం (PLA) తన రహస్య హై-పవర్ మైక్రోవేవ్ ఆయుధ కార్యక్రమానికి సంబంధించిన ఇంతటి వివరణాత్మక సమాచారాన్ని బహిరంగంగా పంచుకోవడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి.
ఎలాన్ మస్క్ ‘స్టార్‌లింక్’ లక్ష్యంగా డ్రాగన్ బ్రహ్మాస్త్రం
సాధారణంగా కేవలం 1 గిగావాట్ (GW) మైక్రోవేవ్ పల్స్ దాడి జరిగితేనే అంతరిక్షంలోని ఉపగ్రహాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు పూర్తిగా మొద్దుబారిపోతాయి. అలాంటిది ఇప్పుడు చైనా రెడీ చేసిన 100 గిగావాట్ల సామర్థ్యం గల ఈ వ్యవస్థ ఎంతటి తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తుందో ఊహించుకోవచ్చు. ఈ సాంకేతికతను ఉపగ్రహ వ్యతిరేక ఆయుధంగా ఉపయోగిస్తే.. భూమికి సమీప కక్ష్యలో (LEO) తిరుగుతున్న ఎలాన్ మస్క్‌కు చెందిన అత్యంత ఖరీదైన ‘స్టార్‌లింక్’ (Starlink) వంటి శాటిలైట్ నెట్‌వర్క్‌లను ఇవి క్షణాల్లో బూడిద చేయగలవని అంతర్జాతీయ రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
- Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
- Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
మైనస్ 40 డిగ్రీల్లోనూ పనిచేసే హైబ్రిడ్ వ్యవస్థ
ఇప్పటికే చైనా సైన్యం అనేక గిగావాట్ల పరిధి గల మైక్రోవేవ్ ఆయుధాలను అభివృద్ధి చేసి తమ సైన్యానికి కూడా అందజేసింది. అయితే ఈ కొత్త 100 GW వ్యవస్థ కోసం చైనా శాస్త్రవేత్తలు సరికొత్త ‘లిథియం-అయాన్ కెపాసిటర్ హైబ్రిడ్ వ్యవస్థ’ను రూపొందించారు. ఇది మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ అత్యంత శీతల ఉష్ణోగ్రతలలో సైతం తక్షణమే యాక్టివేట్ అయి, నిరంతరాయంగా విద్యుత్ తరంగాలను విడుదల చేయగలదు. దీనివల్ల మంచుతో కూడిన ధ్రువ ప్రాంతాలలో కూడా చైనా సైన్యం ఎలక్ట్రానిక్ యుద్ధాన్ని సులభంగా విజయం సాధించగలదు. గత కొన్నేళ్లుగా పల్స్డ్-పవర్ టెక్నాలజీలో చైనా ఊహించని వేగంతో దూసుకుపోతోందని, ప్రస్తుతం ఈ రంగంలో డ్రాగన్ కంట్రీ ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరిందని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ మైక్రోవేవ్ వెపన్స్‌ను మరింత చిన్నవిగా, చౌకగా మార్చి యుద్ధ విమానాలు, షిప్పులపై మోహరించేలా చైనా వ్యూహాలు రచిస్తోందని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
-
Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
-
Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..
-
Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
-
Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!