Asim Munir: పాక్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు ఘోర అవమానం.. వీడియో వైరల్..

  • పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు అవమానం..
  • జర్మనీలో ఆపేసిన సెక్యూరిటీ సిబ్బంది..
  • వైరల్ అవుతున్న వీడియో..
Asim Munir

Asim Munir

Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. జర్మనీలో మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఆయనను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. సమావేశానికి వెళ్తున్న అసిమ్ మునీర్‌ను అక్కడి సెక్యూరిటీ ఐడీ కార్డ్ చూపించాలని కోరింది. జర్మన్ సెక్యూరిటీ సిబ్బంది మునీర్‌ను మెడలో వేలాడుతున్న ఐడీ కార్డును చూపించాలని కోరింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘మీ ఐడీ కార్డును తిప్పి చూపగలరా?’’ అని సెక్యూరిటీ అడగడం వీడియోలో కనిపిస్తోంది.

Read Also: Triple Header Sunday: ట్రిపుల్ ధమాకా సండే.. వరుసగా మూడు హై వోల్టేజ్ మ్యాచ్‌లు!

మరోవైపు, జర్మనీలోని సింధీ రాజకీయ సంస్థ జై సింధ్ ముత్తాహిదా మహాజ్(JSMM) అసిమ్ మునీర్‌ను ఆహ్వానించడంపై అభ్యంతరం తెలిపింది. కార్యక్రమ వేదిక వద్ద JSMM సభ్యులు నిరసన చేపట్టారు. పాకిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఫీల్డ్ మార్షల్ మునీర్ పాల్గొనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఆహ్వానాన్ని విచారకరమని అన్నారు. సింధ్ సంస్థ చైర్మన్ షఫీ బర్ఫత్ పాకిస్తాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల్ని ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, జర్మన్ ప్రభుత్వం, అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనల్ని ఎత్తి చూపారు.

మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు ప్రపంచ నాయకులు, రక్షణ నిపుణులు, దౌత్యవేత్తలు పాల్గొనే అంతర్జాతీయ వేదిక. ఇది ప్రపంచ శాంతి, భద్రతా సమస్యలపై చర్చించే ముఖ్యమైన కార్యక్రమం.