US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- పర్యాటకుడిపై అడవి దున్న దాడి
- 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని ప్రముఖ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. భారీ అడవి దున్న (బైసన్) ఒక్కసారిగా పర్యాటకుడిపై దాడి చేసి అతడిని సుమారు 8 అడుగుల ఎత్తుకు గాల్లోకి ఎగరేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
- Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
- Explainer: '2012' సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
- Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
అమెరికాలోని వ్యోమింగ్ రాష్ట్రంలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లోని బ్రిడ్జ్ బే క్యాంప్‌గ్రౌండ్ దగ్గర పర్యాటకుడు తన మనవడితో కలిసి ఫిషింగ్ బ్రిడ్జ్ సమీపంలో నడుస్తుండగా.. దాదాపు 900 కిలోల బరువున్న మగ బైసన్ ఒక్కసారిగా వారి వైపు దూసుకొచ్చింది. ఆ సమయంలో అక్కడే క్యాంపింగ్ చేస్తున్న ప్రొఫెషనల్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ మైక్ మెక్లియోడ్ ఈ ఘటనను ప్రత్యక్షంగా చూశారు. ఆయన తీసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పిల్లలను వెంటాడిన బైసన్
మైక్ మెక్లియోడ్ తెలిపిన వివరాల ప్రకారం… మొదట బైసన్ క్యాంప్‌గ్రౌండ్‌లో తిరుగుతూ కనిపించింది. అనంతరం దానిని ఫొటోలు తీస్తున్న పిల్లల వైపు ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో ఒకరినొకరు హెచ్చరిస్తూ పరుగులు తీశారు. కొంతసేపటి తర్వాత బైసన్ దుమ్ములో విశ్రాంతి తీసుకుంటుండగా పర్యాటకుడు, అతని మనవడు మొబైల్ ఫోన్లతో దాని వీడియో తీయడం ప్రారంభించారు. అయితే బైసన్ లేవడం గమనించిన తాత… ‘‘ఇక్కడి నుంచి వెళ్లిపోదాం’’ అంటూ మనవడితో కలిసి చెట్ల వైపు పరుగెత్తాడు. ఇంతలోనే మొదట బైసన్ ఓ పికప్ ట్రక్ వైపు దూసుకెళ్లింది. డ్రైవర్ వెంటనే వాహనం వేగంగా తీసుకెళ్లడంతో తిరిగి చెట్ల వైపు పరుగెత్తింది. మనవడు తప్పించుకోగలిగినా.. తాతను మాత్రం బైసన్ వెంటాడింది. అనంతరం తన ఎడమ కొమ్ముతో పర్యాటకుడి నడుము భాగాన్ని గట్టిగా ఢీకొట్టి గాల్లోకి ఎగరేసింది.
మైక్ మెక్లియోడ్ మాట్లాడుతూ… ‘‘బైసన్ తన ఎడమ కొమ్ముతో అతడిని పైకి ఎత్తి విసిరేసింది. అతను గాల్లో ఒక పూర్తి పల్టీ కొట్టి పక్కకు పడిపోయాడు. బైసన్ దాదాపు 6 అడుగుల ఎత్తు ఉంటుంది. కానీ బాధితుడు దాని కంటే చాలా ఎత్తుకు వెళ్లాడు.’’ అని వివరించారు. బైసన్ మరోసారి దాడి చేస్తుందేమోనని భావించిన మైక్ మెక్లియోడ్ వీడియో తీయడం ఆపేసి బైసన్ వైపు పరుగెత్తారు. బిగ్గరగా అరుస్తూ దానిని భయపెట్టేందుకు ప్రయత్నించారు. ఇతర క్యాంపర్లు కూడా సహాయం చేయడంతో బైసన్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అనంతరం బాధితుడి మనవడు మాట్లాడుతూ… ‘‘తాతకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా ప్రమాదం పూర్తిగా తప్పలేదు.’’ అని తెలిపినట్లు మెక్లియోడ్ వెల్లడించారు. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ నిర్వహణ సంస్థ (NPS) తెలిపిన వివరాల ప్రకారం… గాయపడిన వ్యక్తిని అత్యవసర వైద్య సిబ్బంది సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. బైసన్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. బైసన్ల వంటి భారీ జంతువులకు కనీసం 25 గజాల దూరం, ఎలుగుబంట్లు, తోడేళ్లు, కూగర్ల వంటి మృగాలకు 100 గజాల దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ ఘటనలో పర్యాటకులు సూచించిన దూరం పాటించినప్పటికీ, ప్రస్తుతం బైసన్ల సంతానోత్పత్తి కాలం కొనసాగుతుండటంతో అవి అత్యంత దూకుడుగా ప్రవర్తిస్తున్నాయని వైల్డ్‌లైఫ్ నిపుణులు చెబుతున్నారు.
A tourist was seriously injured Friday evening after being thrown 8 feet into the air by a bull bison in Yellowstone National Park. Professional photographer Mike Macleod filmed the incident and said the bison was "angry, agitated and charging anything and everything." (No audio) pic.twitter.com/ELmHQjvxFj
— Molly Ploofkins (@Mollyploofkins) July 12, 2026
తాజావార్తలు
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!