US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
- అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విలియం జె.పుల్టే నియామకం
- సోషల్ మీడియాలో అభినందనలు తెల్పిన ట్రంప్
- ఇటీవలే రాజీనామా చేసిన తులసి గబ్బార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నియామకాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఫెడరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఏజెన్సీ (FHFA) డైరెక్టర్‌గా, అలాగే ఫ్యానీ మే-ఫ్రెడీ మాక్ సంస్థల చైర్మన్‌గా ఉన్న విలియమ్ జే. పుల్టేను తాత్కాలిక జాతీయ నిఘా డైరెక్టర్ (Acting Director of National Intelligence)గా నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేశారు. అమెరికాలో అత్యంత సున్నితమైన అంశాల నిర్వహణలో విలియమ్ పుల్టేకు విశేష అనుభవం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా మార్కెట్ల భద్రత, స్థిరత్వాన్ని కాపాడడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.
అలాగే ఫ్యానీ మే, ఫ్రెడీ మాక్ సంస్థల ఆధ్వర్యంలో 10 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆస్తుల నిర్వహణను విజయవంతంగా చేపట్టారని… కేవలం ఏడాది క్రితం ఉన్న స్థాయితో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని ట్రంప్ వివరించారు. తాత్కాలిక జాతీయ నిఘా డైరెక్టర్ బాధ్యతలు నిర్వహించే కాలంలో కూడా పుల్టే ఫెడరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా, ఫ్యానీ మే-ఫ్రెడీ మాక్ చైర్మన్‌గా కొనసాగుతారని ట్రంప్ స్పష్టం చేశారు. “డైరెక్టర్ పుల్టేకు అభినందనలు” అంటూ ట్రంప్ తన సందేశాన్ని ముగించారు. ఈ నియామకం అమెరికా పరిపాలనలో కీలక మార్పుగా భావిస్తున్నారు.
Also Read
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ఇటీవల అమెరికా జాతీయ గూఢచార డైరెక్టర్‌గా ఉన్న తులసి గబ్బార్డ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు. పూర్తిగా కుటుంబ పరిస్థితుల వల్లే తాను తప్పుకోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. గబ్బార్డ్ భర్తకు అరుదైన రోగం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ క్లిష్ట సమయంలో భర్తకు అండగా నిలబడటమే తనకు అత్యంత ముఖ్యమని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
On Truth Social, US President Donald Trump posts, "I am appointing the Director of the Federal Housing Finance Agency, and Chairman of Fannie Mae/Freddie Mac, William J. Pulte, to serve as Acting Director of National Intelligence. William has deep experience managing the most… pic.twitter.com/wMJAQnN1RD
— ANI (@ANI) June 2, 2026
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!